హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS MLC : ముగిసిన విత్ డ్రా సమయం.. సగం స్థానాల్లో అభ్యర్థుల ఏకగ్రీవం

TS MLC : ముగిసిన విత్ డ్రా సమయం.. సగం స్థానాల్లో అభ్యర్థుల ఏకగ్రీవం

election-commission

election-commission

TS MLC : తెలంగాణలోని స్థానిక సంస్థల కోటాలో TS MLC టీఆర్ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆపార్టీ ఖాతాలో సగం స్థానాలు చేరాయి. వరంగల్ ,నిజామాబాద్, మహబుబ్‌నగర్ ‌తో పాటు రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.

ఇంకా చదవండి ...

  స్థానిక సంస్థల ఎన్నికల పోరులో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. నేటితో నామినేషన్ల ఉపసంహర గడువు ముగియడంతో పలువరు ఇండిపెండెండ్ అభ్యర్థులు తమ నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో పలు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

  తెలంగాణలోని ( Localbody mlc elections 2021 )హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తొమ్మిది ఉమ్మడి జిల్లాలని పన్నెండు స్థానాలకు టీఆర్ఎస్ సభ్యులు నామినేషన్ ధాఖలు చేశారు. వీరితో పాటు ఖమ్మం , మెదక్ జిల్లాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయగా మొత్తం 100పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు.

  ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ వేసిన అభ్యర్థుల నామినేషన్ స్క్రూటినిలో తిరస్కరించగా మరి కొన్ని చోట్ల నేడు అభ్యర్థులే విత్ డ్రా చేసుకున్నారు.( Localbody mlc elections 2021 ) ఈ సంధర్భలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొటగిరి శ్రీనివాస రావు నామినేషన్‌ను బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు తమకు తెలియకుండా సంతకాలు పెట్టుకున్నారనే ఆరోపణ చేయడతో ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ రద్దు చేశారు. దీంతో ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం అయ్యారు.

  ఇది చదవండి : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా .. ఇటివలే మనవరాలి పెళ్లి.. హాజరైన ఇద్దరు సీఎంలు


  ఈ సంధర్భంలోనే నేడు వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వరంగల్ స్థానానికి 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ వేయగా అందులో పదిమంది అభ్యర్ధుల నామినేషన్స్‌ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ స్క్రూటినిలో రద్దులో చేశారు. ( Localbody mlc elections 2021 )ఇక మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు కూడా నేడు తమ నామినేషన్స్‌ను విత్ ‌డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం కానున్నారు.

  మరోవైపు మహాబుబ్‌నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. ( Localbody mlc elections 2021 )దీంతో ఆ జిల్లా నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగిలారు. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

  ఇది చదవండి : ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ కీలక నిర్ణయం ..


  రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి అభ్యర్థులిద్దరే పోటీలో నిలిచారు. ( Localbody mlc elections 2021 )వీరి ఎన్నికను నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Telangana, Telangana mlc election

  ఉత్తమ కథలు