హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad Pub: పబ్‌లో చిన్నారి డ్యాన్స్.. అలా వెలుగులోకి వచ్చిన వీడియో.. అసలేం జరిగిందంటే..?

Hyderabad Pub: పబ్‌లో చిన్నారి డ్యాన్స్.. అలా వెలుగులోకి వచ్చిన వీడియో.. అసలేం జరిగిందంటే..?

పబ్‌లో చిన్నారి డ్యాన్స్

పబ్‌లో చిన్నారి డ్యాన్స్

హైదరాబాద్‌లో పబ్‌(Pub) నిర్వహకులు నిబంధనలు తుంగల్లో తొక్కుతున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారీతినా వ్యవహరిస్తున్నాయి.

హైదరాబాద్‌లో పబ్‌(Pub) నిర్వహకులు నిబంధనలు తుంగల్లో తొక్కుతున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారీతినా వ్యవహరిస్తున్నాయి. పబ్ నిర్వహకులు ఎంత దారుణంగా రూల్స్ అతిక్రమిస్తున్నారో తెలిపే ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. 18 ఏళ్లు దాటని వారిని పబ్‌లు, వైన్‌షాపులకు అనుమతించకూడదనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు విరుద్దంగా ఓ పబ్‌లోకి చిన్నారిని అనుమతించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను రికార్డు చేసిన ఓ వ్యక్తి.. సైబరాబాద్ సీపీ, డీజీపీ, మీడియా ఛానెళ్లకు ట్యాగ్ చేశాడు. పబ్‌లో ఈ చిన్నారికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ఈ ఘటన గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో(Lal Street pub) చోటుచేసుకుంది.

ఈ వీడియోలో చిన్నారి పబ్‌లో డీజే సౌండ్స్‌కు(DJ Sound) అనుగుణంగా డ్యాన్స్ చేసింది. ఇక, తన ఫ్యామిలీ సభ్యులతోనే చిన్నారి పబ్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే చిన్నారిని పబ్‌‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించిన వీడియో పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఈ ఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. చిన్నారి పబ్‌లోకి ఎలా అనుమతించారు..?, పబ్‌లోనికి తీసుకుని వచ్చింది ఎవరనే విషయాలపై ఆరా తీస్తున్నారు. పబ్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

Siddipet: తహసీల్దార్ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మహిళా రైతు.. తీవ్ర ఉద్రిక్తత..

నిబంధనలు పాటించని పబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్నారిని పబ్‌లోకి అనుమతించడం నిర్వాహకుల తప్పని.. ఒకవేళ కుటుంబ సభ్యులే అక్కడికి తీసుకొచ్చి ఉంటే వారు చేసింది చాలా పెద్ద తప్పు అవుతుందని పలువురు అంటున్నారు.

Telanagna rains: రెయిన్ అలర్ట్.. తెలంగాణలో వానలపై లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి..

ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. హైదరాబాద్(Hyderabad) నగరంలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు యువతి ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. నూర్‌ఖాన్‌బజార్‌ ఉస్మాన్‌పురా ప్రాంతానికి చెందిన వాసియా బేగం ఇంట్లో సోదరి కూతురు ముస్కాన్‌ బేగం (19) ఉంటుంది. ఆ యువతి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అయితే ఆగస్టు 28వ తేదీ సాయంత్రం ముస్కాన్ బేగం ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పింది. ఆ తర్వాత బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలింపు చేపట్టిన లాభం లేకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన వాసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Hyderabad, Telangana

ఉత్తమ కథలు