హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ .. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్ ఎందుకంటే..?

Hyderabad : మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్ .. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్ ఎందుకంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Hyderabad : మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్.శుక్ర, శనివారాలు మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు. గణేష్‌ నిమజ్జనం కోసం పోలీసు శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసిన పోలీస్‌శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌(Hyderabad)లో మద్యం షాపులు మూసివేయాలని పోలీసుశాఖ (Police Department)ఆదేశింది. ఈనేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్Secunderabad జంటనగరాల పరిధిలో శుక్రవారం(Friday) ఉదయం 6గంటల నుంచి ఆదివారం(Sunday)ఉదయం 6గంటల వరకు అంటే రెండ్రోజుల పాటు వైన్ షాపులు, కల్లు, దుకాణాలు మూసివేయనున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనం కారణంగా జంటనగరాల్లోని మూడు కమీషనరేట్ల పరిధిలో రెండ్రోజుల పాటు ఈ ఆంక్షలు పాటించాలని పోలీస్‌ శాఖ ఆదేశించింది. రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తారన్న వార్త తెలియడంతో గురువారం సాయంత్రం నుంచే బార్‌లు, వైన్స్‌ల ముందు మందుబాబులు బారులు తీరారు.

TSRTC Special Services: ఆఫీస్ నుంచే సొంత ఊర్లకు నేరుగా వెళ్లొచ్చు.. ఆ ఉద్యోగుల కోసం TSRTC స్పెషల్ సర్వీసులు.. వివరాలివేమద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..
తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగ దినాలు, సెలవు రోజుల్లో లిక్కర్ సేల్స్‌ ద్వారా రాష్ట్రానికి ఆదాయం మరింత పెరుగుతుంది. కాని గణేష్ నిమజ్జనం కారణంగా ఏటా మద్యం షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ అదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగనే శుక్ర, శనివారాలు రెండ్రోజులు అనగా సెప్టెంబర్ 9,10వ తేదిల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి వైన్స్, కల్లు దుకాణాలు తెరవకూడదని, మద్యం విక్రయించకూడదని పోలీస్‌శాఖ ఆదేశించడమైనది.


రెండ్రోజులు వైన్స్ బంద్..
రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలన్న వార్త చాలా మంది మద్యం ప్రియులకు ఆలస్యంగా తెలియడంతో గురువారం సాయంత్రం నుంచే బార్‌లు, వైన్స్‌ల దగ్గర రద్దీ కనిపించింది. ముఖ్యంగా వీకెండ్స్ కావడంతో ఖచ్చితంగా పార్టీలు, గెట్ టు గెదర్‌లు జరుపుకోవాలనుకునే వాళ్లు రెండ్రోజుల పాటు మద్యం దొరకదనే వార్త తెలిసి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం కోసం గురువారం మద్యం షాపుల దగ్గర క్యూలు కట్టారు. రోజుకు మద్యం అమ్మకాల ద్వారానే రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. కేవలం నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసిన హైదరాబాద్‌ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈనిర్ణయం తీసుకోవడం జరిగింది.

TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఆ జిల్లాల్లో 3 రోజుల పాటు సెలవులు.. వివరాలివే


రెండ్రోజుల ఆదాయం తగ్గినట్లే..
వాస్తవంగా పండుగ, సెలవు రోజుల్లో తెలంగాణలో మద్యం సేల్స్ బాగా ఉంటుంది. దీని ద్వారా రాష్ట్ర ఎక్సైజ్‌శాఖకు వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా బోనాలు, నిమజ్జనం, హోలీ, ఫ్రెండ్‌షిప్‌ డే వంటి రోజుల్లో విక్రయాలు జోరుగా ఉంటాయి. కాని శాంతి భద్రత దృష్ట్య పోలీస్‌శాఖ నిమజ్జనం రోజు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించడం సాధారణంగా జరిగే అంశమే. కాకపోతే ఈసంవత్సరం రెండ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Hyderabad police, Telangana News

ఉత్తమ కథలు