HYDERABAD LIQUOR SALES RECORD IN TELANGANA WAS 523 CRORE IN FOUR DAYS SNR
Telangana:ధరలు పెంచినా తగ్గేదేలే..నాల్గు రోజుల్లో ఎన్ని వందల కోట్ల రూపాయల మద్యం తాగారో తెలుసా
(ప్రతీకాత్మకచిత్రం)
Telangana:తెలంగాణలో మద్యం సేల్స్ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఏఢాది, నెలలో జరిగే అమ్మకాలు లెక్కలు చూసే వారు. కాని ఈసారి నాలుగు, ఐదు రోజుల్లోనే ఆస్థాయిలో మద్యం అమ్మకాలు పెరిగాయి. ఎక్సైజ్‌శాఖ ఖజానాను నింపుతున్నారు మద్యం ప్రియులు.
తెలంగాణ(Telangana)లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. ధరలు పెరిగినా, ఎండలు మండిపోతున్న..మద్యం ప్రియులు మాత్రం లిక్కర్ Liquor సేవించడంలో తగ్గేదేలే అంటున్నారు. వేల లీటర్లలో మద్యం, లక్షల బీర్ల బాటిల్స్ కాళీ చేస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖExcise Department ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడైన నాలుగు రోజుల మద్యం అమ్మకాల లెక్కలే ఇందుకు నిదర్శం. ఐదు వందల కోట్ల రూపాయలు దాటిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సర్కారు మద్యం రేట్లు పెంచి మందుబాబుల జేబులకు చిల్లి పెడుతున్నప్పటికి రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోంది. మద్యం ప్రియులు కిక్కు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. యూత్ అయితే వేసవి తాపానికి కూల్స్డ్రింక్స్కి బదులుగా బీర్లు ఎత్తేస్తున్నారు.
వందల కోట్ల ఆదాయం..
ఈనెల 19వ తేది అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో కొత్తగా పెంచిన మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. ఆ రోజు వరకు కేవలం 75కోట్ల రూపాయల మద్యం మాత్రమే అమ్ముడవగా..తర్వాత నాలుగు రోజులు అమ్మకాలు ఇంకా పెరిగాయి. చీప్ లిక్కర్ క్వార్టర్‌పై 25 రూపాయలు, బీర్ బాటిల్‌పై పది రూపాయలు పెంచింది సర్కారు. ధరల పెంపు ప్రభావం ఏమాత్రం మద్యం సేల్స్‌పై చూపించలేదు. గతంలో కంటే ఎక్కువగా అంటే 20వ తేది నుంచి చూసుకుంటే రోజు పెరుగుతూ వచ్చాయి. నాలుగు రోజుల్లో 523కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు మద్యం ప్రియులు. రోజు వారి లెక్కలు చూసుకుంటే 20వ తేదిన 145.3 కోట్లు, 21న రూ. 149.5 కోట్లు, 22న రూ. 153.5 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ధరల పెంపు తర్వాత రోజుకు సగటున రూ. 130 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
నాలుగు రోజుల్లో మద్యం సేల్స్..
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటా రికార్డ్ స్థాయిలో జరుగుతాయి. ఈసారి ఆ రికార్డ్ మరింత ఎక్కువగా ఉంది. మద్యం ధరలు పెంచిన నాటి నుంచి నాలుగు రోజుల్లో చూసుకుంటే 8.31 లక్షల కేసుల బీర్లు తాగిపారేశారు మందుబాబు. ఇక 4.88 లక్షల కేసుల లిక్కర్ బాటిల్స్ ఊదేశారు. ఈ లెక్కలు గతేడాది మే నెల విక్రయాలతో పోలిస్తే 36.27 శాతం పెరిగినట్లుగా ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మే, జూన్ నెల మొదటి వారం వరకు ఎండలు ఇదే స్థాయిలో ఉంటే మద్యం సేల్స్ మూడు విస్కీ కాటన్లు, ఆరు బీర్ కేసులు మాదిరిగా వర్ధిల్లుతుందనడంతో సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.