హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం..బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్

బండి సంజయ్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర దిలావర్ పూర్ కు చేరుకుంది. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై బండి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో మహోద్యానికి ప్రజలు సిద్ధం కావాలని బండి సంజయ్  (Bandi Sanjay) పిలుపునిచ్చారు. రాష్ట్రం నుండి కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టాలన్నారు. తెలంగాణ వచ్చినా ఏమి ఒరగలేదు. ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆగలేదని బండి సంజయ్ అన్నారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర (praja Sangrama Yatra) దిలావర్ పూర్ కు చేరుకుంది. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై బండి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో మహోద్యానికి ప్రజలు సిద్ధం కావాలని బండి సంజయ్  (Bandi Sanjay) పిలుపునిచ్చారు. రాష్ట్రం నుండి కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టాలన్నారు. తెలంగాణ వచ్చినా ఏమి ఒరగలేదు. ఆకలి చావులు, ఆత్మహత్యలు ఆగలేదని బండి సంజయ్ అన్నారు.

కేటీఆర్ ను డాక్టర్ గా చూడాలనుకున్నది ఎవరు?..ఆసక్తికర విషయం పంచుకున్న యువనేత

2 నెలల ఫించన్లు కట్ చేశారు..

ఇప్పటికే 2 నెలల ఫించన్లు కట్ చేశారు. ఫామ్ హౌస్ లో సాగు చేసి కేసీఆర్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు. మిగతా రైతులు బికారీలు ఎందుకయ్యారని బండి సంజయ్  (Bandi Sanjay) ప్రశ్నించారు. ఇక వడ్ల సేకరణలో కేసీఆర్ పెద్ద కుట్ర చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఇస్తుంది కేంద్రమే. ఎకరానికి ఎరువుల పేరుతో రూ.30 వేల సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. కానీ కేసీఆర్ రైతుబంధు పేరుతో సబ్సీడీలన్నీ బంద్ చేశారన్నారు. ఇక కవితకు సీబీఐ నోటీసులు ఇస్తే తెలంగాణ మొత్తం ఎందుకు ధర్నా చేయాలన్నారు.

Telangana: తెలంగాణలో KA పాల్ పాదయాత్ర..ముహూర్తం ఫిక్స్..ఎప్పటినుంచంటే?

20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర యాత్ర

ఐదో విడత పాదయాత్రలో భాగంగా భైంసా నుండి కరీంనగర్ వరకు యాత్ర సాగనుంది. 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 17వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.  4న లక్ష్మణ్ చందా మండలంలో 5న మమ్డా మండలంలో, 6,7న ఖానాపూర్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. డిసెంబర్ 8,9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలో 21.7 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగనుంది.

డిసెంబర్ 10న కోరుట్ల పట్టణం మీదుగా వేములవాడ నియోజకవర్గానికి చేరుకోనుంది.డిసెంబర్ 11న మేడిపల్లి, తాటిపల్లి మీదుగా జగిత్యాల రూరల్ వరకు యాత్ర సాగనుంది. డిసెంబర్ 12న జగిత్యాల పట్టణం, డిసెంబర్ 13న చొప్పదండి నియోజకవర్గం నుండి కొండగట్టుకు చేరుకోనుంది. డిసెంబర్ 14,15,16 తేదీలో చొప్పదండిలో యాత్ర కొనసాగగా..డిసెంబర్ 16,17న కరీంనగర్ లో పాదయాత్ర సాగగా చివరి రోజు కరీంనగర్ (Karimnagar) లోని SR నగర్ కళాశాల వద్ద పాదయాత్ర ముగియనుంది.

First published:

Tags: Bandi sanjay, Bjp, Hyderabad, Kalvakuntla Kavitha, Telangana

ఉత్తమ కథలు