Home /News /telangana /

HYDERABAD LEADING ASTROLOGER MULUGU RAMALINGESWARA SIDDHANTI MOURNED THE DEATH OF AP CM JAGAN SNR

శివైక్యం చెందిన ములుగు రామలింగేశ్వర సిద్దాంతి ..ఏపీ సీఎం జగన్‌ సంతాపం

(రామలింగేశ్వర సిద్దాంతి)

(రామలింగేశ్వర సిద్దాంతి)

Ramalingeswara Siddhanti: శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి వీరశైవ పీథాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఈరోజు అనగా జనవరి 23, 2022న సాయంత్రం 5.30 నిమిషాలకు శివైక్యం చెందారని mulugu.com నిర్వాహకులు కొడుకు సోమేశ్వర్ రావు తెలిపారు.

ఇంకా చదవండి ...
శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి వీరశైవ పీథాధిపతి శ్రీ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ఈరోజున జనవరి 23 సాయంత్రం 5.30 నిమిషాలకు శివైక్యం చెందారు. సుమారు నాలుగు దశాబ్ధాలకు పైగా నిస్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలు, పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను తన పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేశారు రామలింగేశ్వర సిద్ధాంతి, ములుగు సిద్ధాంతిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన రామలింగేశ్వర సిద్ధాంతి గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎంతోమంది సిని, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు, దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వంశపారంపర్యంగా వస్తున్న తమ దైవ కృప వలన జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా మారారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపత హోమాలు నిర్వహించేవారు. అందరికన్న దైవం గొప్పదని, ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమం ప్రీతితో స్వీకరించి మనకు కావాల్సిన ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు.

జ్యోతిష్య సిద్ధాంతి ఇకలేరు..
ప్రతిసంవత్సరం ములుగు సిద్ధాంతి అందించే పంచాంగ ఫలితాలు ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నట్లు mulugu.com నిర్వాహకులు ఆయన కుమారుడు సోమేశ్వర్ రావు తెలిపారు. లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారినుండి ప్రపంచానికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి.

సిద్ధాంతి మృతికి ఏపీ సీఎం సంతాపం..
ములుగు సిద్ధాంతి గా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడాని ముందు ముందు ఎంఆర్‌ ప్రసాద్‌ పేరుతో( MR Prasad)పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. రామలింగేశ్వర సిద్ధాంతి చేసిన శ్రీదేవి పెళ్లి క్యాసెట్ ఆ రోజుల్లోనే లక్షలాది కాపీలతో రికార్డులు సృష్టించింది. సినీ నటులు ఏపీఎస్‌, బ్రహ్మానందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శనలు నిర్వహించారు ములుగు రామలింగేశ్వర వర ప్రసాద్. ములుగు సిద్ధాంతి ఆశయాలను, వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళతామని, వారి దివ్య ఆశీస్సులతో ఆయన తలపెట్టిన పనులు తమ వంతుగా చేస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం చెందడంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. సిద్ధాంతి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Astrology, Mulugu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు