Home /News /telangana /

HYDERABAD LEADERS AND PEOPLE ARE ANGRY WITH THE TRS GOVERNMENT FOR NOT DOING DEVELOPMENT WORKS SNR

Telangana : అధికార పార్టీకి అభివృద్ధి పనుల స్ట్రోక్ .. రియాక్షన్‌ మాములుగా లేదు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana : అధికార పార్టీ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తుంటే ప్రజలు, పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తుండగానే కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌ నేతలు జిల్లాలో అభివృద్ధి పనులు చేయడం లేదని పార్టీని వీడారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణ(Telangana)లో అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోందా..? ఐదేళ్లలో పూర్తి చేసిన అభివృద్ధి పనుల్ని ఎన్నికలకు మరో ఏడాది ముందు టెంకాయ కొట్టి ప్రజల దగ్గర మార్కులు కొట్టేద్దామనుకుంటే సీన్‌ రివర్స్ అయిందా..? టీఆర్ఎస్‌(TRS)కి ఓవైపు ఉపఎన్నికల టెన్షన్ ..మరోవైపు బీజేపీ(BJP) ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్‌ పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది చాలదంటూ పార్టీలోని వర్గవిభేదాలు పంటికింద రాయిలా తయారయ్యాయి. అందుకే సాక్షాత్తు ముఖ్యమంత్రే జిల్లా పర్యటనకు వస్తున్నారంటే నేతల్లో, ప్రజల్లో హడావుడే కరువైనట్లుగా కనిపిస్తోంది.

KCR: ప్రధాని మోదీది వేషం తప్ప ఏమీ లేదు.. తెలంగాణను గుంటనక్కల పాలు కానివొద్దన్న సీఎం కేసీఆర్గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లు..
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికార టీఆర్‌ఎస్‌కి గడ్డుకాలం తప్పదా అనే సందేహాలు వ్యక్తుమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రచారానికి తోడు ఇచ్చిన హామీలను విస్మరించి అభివృద్ధిని అటకెక్కించారని సామాన్య ప్రజల విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తుంటే జిల్లా ప్రజలకు గతంలో ఇచ్చిన హామీల సంగతి ఏమిటని గుర్తు చేస్తున్నారు. పూర్తి చేస్తామన్న పనులు పెండింగ్‌ పెట్టారంటూ ఏకరువు పెడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టరెట్‌లు, ఎస్పీ కార్యాలయాలు, పార్టీ నియోజకవర్గ కార్యాలయాల ప్రారంభోత్సవం  చేశారు సీఎం కేసీఆర్.

జనం మనసులో మాట ..
వికారాబాద్ జిల్లా ధారుర్‌ మండలంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయని కారణంగా వర్షాకాలం వస్తే చాలు వరదల్లో ప్రజలు కొట్టుకుపోతున్న పరిస్థితి పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారట. అంతే కాదు పొలం పనులు మానుకొని మరీ సీఎం సభకు వెళ్లడం వల్లే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదనే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌కి ద్వితియశ్రేణి నేతలు గుడ్‌బై ..
వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి చాప కింద నీరులా ఉంటే ..కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలో డైరెక్టుగా బయటపడుతోంది. బెజ్జూర్‌ మండలానికి చెందిన అధికార పార్టీ నేతలైన బెజ్జూర్‌ జడ్పీటీసీ సభ్యులు పుష్పలత, కుష్నెపల్లి ఎంపీటీసీ సభ్యులు సాయన్న, ముగ్గురు సర్పంచ్ లు, ఓ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పార్టీకి రాజీనామా చేశారు. మండలంలో రోడ్లు, వంతెనలు లేక జనం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా సౌకర్యాలు కల్పిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కారు నిలుపుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Asaduddin Owaisi : సామూహిక జాతీయ గీతాలాపనలో ఎంపీ తీరుపై విమర్శలు .. ఇదేనా మీ దేశభక్తి అంటూ అసదుద్దీన్‌పై సెటైర్లు


ప్రజాగ్రహం ..
ఇవే కాదు సమీపంలో సరైన వైద్య సౌకర్యాలు లేక.. ఏటా ఇద్దరు, ముగ్గురు గర్భిణులు రోడ్లపై ప్రసవిస్తున్నారని ఆవేదన వెళ్లగక్కారు. ఇటీవల సంభవించిన వరదలు, వర్షాలతో ఈనెల 9 నుంచి నేటి వరకు జలదిగ్భందంలో ఉండటంతో బెజ్జూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని గుర్తు చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Telangana News, Trs, Vikarabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు