హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kukatpally firing : నాందేడ్ నుండి నగరానికి బైక్‌పై... యూపికి చెందిన ముఠాగా గుర్తింపు

Kukatpally firing : నాందేడ్ నుండి నగరానికి బైక్‌పై... యూపికి చెందిన ముఠాగా గుర్తింపు

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

Kukatpally firing : కూకట్‌పల్లి ఏటిఎం కాల్పుల్లో పాల్గోన్న ముఠా యూపికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నాందేడ్ నుండి బైక్‌పై వచ్చి ..నాలుగు రోజులపాటు రెక్కి నిర్వహించారు.

  కూకట్‌పల్లి ఏటీఎంలో కాల్పులు జరిపిన దుండగులను హైదరాబాద్ పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్న విషయం తెలిసిందే...అయితే పట్టుకున్న నిందితులు ఇద్దరు యూపికి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు నిందితులు యూపిలోని లఖ్‌నవ్ నుండి రైలులో నాందేడ్ కు అక్కడ నుండి నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు టూవీలర్‌పై వచ్చినట్టు పోలీసులు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.

  అయితే కాల్పులకు తెగబడ్డ ఇద్దరు నగరంలోని పలు ఏటిఎం కేంద్రాల వద్ద రెండు రోజుల పాటు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది.కాల్పులు జరిగిన కూకట్‌పల్లి పటేల్ కుంటవద్ద దోపిడి చేయడం ద్వార సులభంగా తప్పించుకోవచ్చని నిందితులు భావించినట్టు సమాచారం.

  అయితే పదిహను రోజుల క్రితం జీడిమెట్లలో మనిట్రాన్స్‌ఫర్ సంస్థలో డబ్బులు దోపిడి చేసింది కూడ ఈ ముఠా పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాగా నిందితులు ఈ పదిహేను రోజులు ఎక్కడ ఉన్నారు. ఎవరి సహాకారం తీసుకున్నారనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం సీపీ సజ్జనార్ సైతం కూకట్ పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరి విచారించినట్టు సమాచారం.

  కాల్పులు జరిపిన నిందితులు ముందుగా డబ్బును తీసుకువెళ్లేందుకే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే సెక్యూరిటి సిబ్బంది ప్రతిఘటించడంతోనే కాల్పులు జరిపినట్టు తెలిపినట్టు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత మరో రెండు రోజుల్లో మీడియా ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.

  చాల రోజుల తర్వాత ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసును చాల సీరియస్ తీసుకున్న సీపీ సజ్జనార్ నిందితులను పట్టుకునేందుకు వెంటనే ఆరు బృందాలను ఏర్పాటు చేసి నిందితులను సంగారెడ్డి వద్ద పట్టుకున్నారు.. ముఠాను కెమెరాల సహయంతో చేధించారు. ఇద్దరు ముఠా సభ్యులు డబ్బును తీసుకుని బ్లాక్ పల్సర్ వాహనంపై వెళుతున్న దృశ్యాలను సేకరించారు. డబ్బులు దోచుకున్న దుండగులు బైక్ కూకట్‌పల్లి నుండి సంగారెడ్డి మీదుగా నాందేడ్ వెళుతుండగా సంగారెడ్డి వద్ద నిఘా పెట్టి పట్టుకున్నారు. అయితే కాల్పుల ఘటనలో ఏటిఎం వ్యాన్ డ్రైవర్ ఆలీ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించగా.. ఆలీ చికిత్స పోందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే..

  Published by:yveerash yveerash
  First published:

  Tags: ATM, Gun fire, Hyderabad, Kukatpally police

  ఉత్తమ కథలు