Kukatpally firing : కూకట్‌పల్లి కాల్పుల దుండగులను పట్టుకున్న పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

Kukatpally firing :కూకట్‌పల్లి ఏటీఎంలో కాల్పులు కేనును పోలీసులు గంటల్లోనే చేధించారు..కాల్పులు జరిపిన దుండగులను హైదరాబాద్ పోలీసులు అనతి కాలంలోనే పట్ట్టుకున్నారు.

  • Share this:
కూకట్‌పల్లి ఏటీఎంలో కాల్పులు జరిపిన దుండగులను హైదరాబాద్ పోలీసులు అనతి కాలంలోనే పట్టుకున్నారు.ఏటీఎంలో డబ్బులు రీఫిల్ చేస్తుండగా కాల్పులు జరిపిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసును చాల సీరియస్ తీసుకున్న సీపీ సజ్జనార్ నిందితులను పట్టుకునేందుకు వెంటనే ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.

దీంతో పోలీసు బృందాలు రంగంలోకి చోరి చేసిన ముఠాను కెమెరాల సహయంతో చేధించారు. ఇద్దరు ముఠా సభ్యులు డబ్బును తీసుకుని బ్లాక్ పల్సర్ వాహనంపై వెళుతున్న దృశ్యాలను సేకరించారు. డబ్బులు దోచుకున్న దుండగులు బైక్ కూకట్‌పల్లి నుండి సంగారెడ్డి మీదుగా నాందేడ్ వెళుతుండగా సంగారెడ్డి వద్ద నిఘా పెట్టి పట్టుకున్నారు. అయితే ఇద్దరు దుండగులు గత పదిహేను రోజుల క్రితం జీడిమెట్లలో బ్యాంకు చోరీకి పాల్పడినట్టుగా సమాచారం.

కాగా కూకట్‌పల్లిలోని పటేల్ కుంటలోని హెడిహెఎఫ్‌సి ఏటిఎంలో సిబ్బంది డబ్బులు రీఫిల్ చేస్తుండగా నిందితులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం అయిదు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. కాల్పుల్లో ఏటిఎం వ్యాన్ డ్రైవర్ ఆలీ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆలీ చికిత్స పోందుతూ మృతిచెందాడు.
Published by:yveerash yveerash
First published: