Home /News /telangana /

HYDERABAD KTR SON HIMANSHU TWEET SAYING OUR GRANDFATHER KCR IS TIGER HAS GONE VIRAL SNR

Himanshu Rao Kalvakuntla : మా తాత టైగరే : హిమాన్షు .. నెటిజన్ల సెటైర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ మనవడు

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Himanshu: ఓ బిజినెస్‌మెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌కి తెలంగాణకు చెందిన ఓ మంత్రి కొడుకు రిప్లై ఇచ్చాడు. అందులో సీఎం కేసీఆర్‌ను ఇన్వాల్వ్ చేయడంతో వార్త వైరల్ అయింది. దీనిపై సెటైర్లు, కౌంటర్లు వేసుకుంటున్నారు నెటిజన్లు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
ఏం చేసినా .. ఎలా స్పందించినా ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో అది చర్చ కావడం దానిపై రచ్చ చేయడం కామన్ అయిపోయింది. తెలంగాణ (Telangana)సీఎం(KCR) మనవడు, మంత్రి కేటీఆర్‌ (KTR)తనయుడు హిమాన్షుHimanshu చేసిన ట్వీట్‌Tweet కూడా అంతే వైరల్ (Viral)అవుతోంది. ట్వీట్‌ చేసిన ఐదు రోజులు గడిచినప్పటికి రియాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఆయన దేనిపై ట్వీట్‌ చేశాడు. అందుకు సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు..దీనంతటికి కారణం ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

Asaduddin Owaisi : సామూహిక జాతీయ గీతాలాపనలో ఎంపీ తీరుపై విమర్శలు .. ఇదేనా మీ దేశభక్తి అంటూ అసదుద్దీన్‌పై సెటైర్లు


ట్వీట్‌పై చర్చ రచ్చ..
బిజినెస్‌మెన్, మహీంద్ర మోటర్స్ గ్రూప్ ఛైర్మెన్ ఆనంద్‌ మహీంద్ర చేసిన ట్వీట్‌కి తెలంగాణ సీఎం మనవడు, మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన తాతయ్య సీఎం కేసీఆర్‌ పులి అంటూ హిమాన్షు ట్వీట్ చేయడాన్ని నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా హిమాన్షురావు కల్వకుంట్లపై కొందరు సెటైర్లు వేస్తుంటే ..మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఈ వార్త కరోనా వైరస్‌లో వ్యాపించి వైరల్ అవుతోంది. ఈనెల 11వ తేదిన ఆనంద్‌ మహీంద్ర ఓ ట్వీట్ చేశారు. తీక్షణంగా చూస్తున్న ఓ పులి బొమ్మను పోస్ట్ చేసి దాని పైన మీ ఇంట్లో ఈ త‌ర‌హా కేట‌గిరీ వ్య‌క్తి ఎవ‌రంటూ ప్ర‌శ్న‌ వేశారు. అంతే కాదు పులి ఫోటోలో అన్నింటినీ సైలెంట్గా గమనిస్తానని న‌మ్ము నేనేమీ రియాక్ట్ కాను అని టైగర్ చెబుతున్న‌ట్లుగా ఉన్న ఫోటోని ట్వీట్ చేశారు.

ట్విట్టర్‌లోనే సెటైర్లు ..
సోషల్ మీడియాలో నచ్చిన అంశాలు, విచిత్రమైన విషయాలు, సందర్భానుసారంగా తారసపడే వీడియోలను షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో బాగా టచ్‌లో ఉండే ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌కి కేసీఆర్‌ మనవడు మా ఇంట్లో ఈ తరహా పులిలా ఉండే వ్యక్తి మా తాతయ్య అంటూ రిప్లై ఇచ్చారు. హిమాన్షు ట్వీట్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఏంటీ మీ తాతయ్య మనిషి కాదా జంతువా అని కొందరు .. ఇంట్లో పిల్లి.. అడవిలో పులి అని ఇంకొందరు. మీ తాత ప్రెస్మీట్లు పెట్టి పిచ్చోనిలాగ ఓర్లుతుండు రా బాబు అంటూ మరికొంత మంది హిమాన్షు ట్వీట్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఈ పోస్ట్ పై హిమాన్షును కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. నీకు మంచి స్కోప్ ఉంది చిన్నా...జబర్దస్త్‌ లో ట్రై చేయ్... టైమింగ్ చాలా బాగుందని కామెంట్ చేశారు.

Telangana : TRS ఎమ్మెల్యే కూతురు పెళ్లికి ఆన్‌లైన్‌లో కట్నాలు వసూలు .. వైరల్ అవుతున్న వాట్సాప్‌ మెసేజ్



తాతపై ప్రేమతో ..
హిమాన్షు ట్వీట్‌పై మరికొందరు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులైతే హిమాన్షును సపోర్ట్ చేస్తూ .. మా లీడర్ కేసీఆర్ ఎప్పటికి పులేనంటూ రిప్లై ఇస్తున్నారు. బెంగాల్ టైగర్ మా కేసీఆర్ అని కేసీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.ఇంతకు ముందు ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు హిమాన్షు తండ్రి కేటీఆర్‌ స్పందిస్తే ఈసారి హిమాన్షు రిప్లై ఇవ్వడంతో ఈట్వీట్‌ టాపిక్‌ హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Ktr son himanshu, Telangana News

తదుపరి వార్తలు