హైదరాబాద్ వాసులకు మంత్రి కేటీఆర్ (Minister KTR) గుడ్ న్యూస్ చెప్పారు. భారీగా ట్రాఫిక్ ఉండే ఎల్బీనగర్-హయత్ నగర్ రూట్ లో మెట్రోను పొడిగిస్తామని మంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ ప్రారంభిస్తాం..అలాగే నాగోల్-ఎల్బీనగర్ లైన్ ను పునరుద్ధరిస్తామని కేటీఆర్ (Minister KTR) తెలిపారు. కాగా ఎల్బీనగర్ లోని కామినేని సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన కేటీఆర్ (Minister KTR) ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఎవరెన్ని చెప్పిన మరోసారి సీఎం కేసీఆరే (Cm Kcr) అని కేటీఆర్ (Minister KTR) ధీమా వ్యక్తం చేశారు.
Minister @KTRTRS inaugurated Box Drain Nala, taken up under Strategic Nala Development Programme (SNDP), stretching from Bandlaguda Cheruvu to Nagole Cheruvu in LB Nagar. The remodelling of existing drains and construction of new ones will prevent inundation in flood prone areas. pic.twitter.com/OL18oiefcU
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 6, 2022
జోడెద్దులు మాదిరిగా అభివృద్ధి, సంక్షేమం..
కాగా తెలంగాణలో జోడెద్దులు మాదిరిగా అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని కేటీఆర్ అన్నారు. పేదల కోసం టీఆర్ఎస్ ఎంతో పని చేస్తుంది. సంపద సృష్టించి పేదలకు పంచుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు తలసరి ఆదాయం 1.20 లక్షలు ఉండగా..తెలంగాణ ఏర్పాటు అయిన ఏడేళ్లలో రూ.2.70 లక్షలకు చేరిందన్నారు. ఇక స్వచ్ఛ సర్వేక్షన్ లో 20 గ్రామాలకు అవార్డులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఎన్ఎన్డిపి కింద 17 నాలాల పనులు పూర్తి చేశామని కేటీఆర్ అన్నారు. జరిగిన అభివృద్ధి అంతా నోటి మాటలతో కాలేదని పటిష్టమైన ప్రణాళికతోనే సాధ్యమైందన్నారు.
Minister @KTRTRS speaking after inaugurating a multi-faith funeral home at Fathullaguda. https://t.co/L65wdBU8vG
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 6, 2022
అటు నాగోల్..ఇటు నాగోల్..మధ్యలో కూడా మెట్రో..
ఇక అటు నాగోల్ ఇటు నాగోల్ వరకు మెట్రో ఉందని, ఇక ఈ మధ్య ఉన్న 5 కిలోమీటర్లు కూడా మెట్రోను పూర్తి చేస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల తరువాత ఫేజ్ 2 మెట్రోను పూర్తి చేస్తామన్నారు. అలాగే ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు కూడా మెట్రోను పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.