Home /News /telangana /

HYDERABAD KSHUDRAPUJA INCIDENT CAME TO LIGHT AGAINST A WOMAN TAHSILDAR IN A CEMETERY IN HYDERABAD OLDCITY PRV

Black magic: రాజధానిలో క్షుద్ర పూజల కలకలం.. సమాధి వద్ద తహసీల్దార్​ ఫొటో పెట్టి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. రెండువారాలుగా శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ శ్మశాన వాటికలో చేతబడి వెలుగులోకి వచ్చింది.

    హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Old city)లో క్షుద్రపూజలు (Black magic) కలకలం రేపుతున్నాయి. రెండువారాలుగా శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి. గుడ్లు, ఇతర వస్తువులపై క్షుద్రమంత్రాలు రాసిఉండటం అటుగా వెళ్తున్నవారి గుండెల్లో గుబులురేపుతోంది. మతాధికారులు, శ్మశానాల (cemetery) ఇంఛార్జీలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ (Hyderabad) పాతబస్తీ చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శ్మశాన వాటికలో సమాధిపై ఓ మహిళా తహసీల్దార్  (Woman Tahsildar)పై చేతబడికి యత్నించారన్న విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బండ్లగూడలో నాలుగేళ్ళు తహసీల్దార్ పనిచేసిన షేక్ ఫర్హాన్ ఫొటోకి క్షుద్రపూజలు (Kshudrapuja) చేసిన స్థలంలో MRO ఫోటో లభ్యం కావడం పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంది.

    పాతబస్తీలో (Old city) బార్కాస్ లోని బడా ఖబ్రస్తాన్లో లో బంధువు సమాధికి (Tomb) పూలు సమర్పించడానికి ఓ వ్యక్తి. ఈనెల 17వ తేదీన వెళ్లాడు అక్కడ సమాధిపైన క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు, ఆందోళనకరమైన వస్తువులు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తి పాతబస్తీ ఛత్రీనాకకు చెందిన చేతబడిని నిర్మూలించే వ్యక్తిగా పేరొందిన జునైద్ బక్బాబీకి కబురు అందించాడు.

    జునైద్ అక్కడికి వెళ్ళి చూడగా సమాధిపై  విచిత్ర వస్తువులు కలిగి ఉన్న ఓ మూట కనిపించింది. దీంతో ఆ మూటను తీసుకున్నాడు జునైద్.తనతో పాటు మూటను ఇంటికి తీసుకువెళ్లి మూటను విప్పాడు. అందులో ఒక్కొక్క వస్తువును బయటికి తీస్తుండగా దారం కట్టి మడత పెట్టిన చిత్రపటం కనిపించింది. అది విప్పగా చిత్రపటం వెనుకాల ఉర్దూ అరబిక్ భాషలో రాసిన పదాలు కనిపించాయి. ముందు భాగంలో బండ్లగూడలో నాలుగేళ్ళ పాటు తహసీల్దార్ కొనసాగిన షేక్ ఫర్హాన్ చిత్రపటం కనిపించడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఇదంతా జునైద్ మూటను విప్పుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది. అయితే ఈ చేతబడి ఆరోపణలు విషయంలో ఇంకా చంద్రయాన్ గుట్ట పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం.

    ఎవరీ షేక్​ ఫర్హాన్​..?

    2018 అక్టోబర్లో బండ్లగూడ మండల తహసీల్దార్​గా షేక్ ఫర్హాన్ బాధ్యతలు స్వీకరించారు. 2018 నుంచి 2022లో బదిలీపై ఆసిఫ్ నగర్ మండల కార్యాలయానికి వెళ్ళారు. ఆమె బదిలీపై వెళ్ళిన 5 నెలల్లోనే ఇలాంటి ఘటన జరగడం పట్ల పాతబస్తీలో తీవ్ర కలకలం రేపుతోంది. షేక్ పర్దీన్ బండ్లగూడలో తహసీల్దార్ చేసిన సమయంలో అందరితో కలుపుగోలుగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.. ఆమెపై ఇలాంటి చర్యలకు ఎవరు? ఎందుకు పాల్పడి ఉంటారని యోచిస్తున్నారు. ఏదైనా స్థల వివాదంలో తహసీల్దార్​పై పగ పెంచుకొని ఇలా చేసి ఉంటారేమో అని స్థానికులు అనుమానిస్తున్నారు.

    నిజంగా చేతబడి ఉంటుందా?

    గొప్ప గొప్ప చదువులు చదివిన కొందరికి మూఢ నమ్మకాల విషయంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. టెక్నాలజీ యుగంలో చేతబడి,క్షుద్రపూజలు (Kshudrapuja) లాంటి ఘటనలు చోటు చేసుకోవడం మన దురదృష్టకరం. చేతబడి పేరుతో మంత్రగాళ్లమని చెప్పుకొనే వారు జనాలను మానసికంగా కుంగదీస్తారని.. వారిని భయభ్రాంతులకు గురిచేసి.. ఉన్నది లేనిది లేనిది ఉన్నట్లు చెబుతారని పలువురు మానసిక వైద్యులు చెబుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Black magic, Hyderabad, Kshudra pooja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు