వివాహేతర సంబంధాలు (Extra marital Affair) జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. హత్యలకు (murder) , ఆత్మహత్యల (Suicide) కు కారణమవుతున్నాయి. వాళ్లను నమ్ముకొని ఉన్న కటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు. రోజూ ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. కట్టుకున్న భార్యను లేదా భర్తను వదిలి పరాయి పురుషుడు/మహిళ మోజులో పడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. వీటిపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది. అయితే ఇక్కడ జరగిన ఘటనలో వివాహేతర సంబంధం పెట్టుకున్న తన భర్తను ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
అంతే కాకుండా ఇలాంటి పని చేసినందుకు చితక బాది పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) గుంటూరు జిల్లా (Gunturu) పెద్దపరిమికి చెందిన ప్రకాష్ కు.. అదే జిల్లాకు చెందిన త్రివేణితో వివాహం జరిగింది. వివాహ సమయంలో అతడికి దాదాపు రూ.20 లక్షల నగదు, 30 సవర్ల బంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమిని వరకట్నం కింద ఇచ్చారు. అతడు బంజారా హిల్స్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేస్తున్నాడు.
ఉద్యోగ రీత్యా వాళ్లు హైదరాబాద్ వచ్చి బంజారా హిల్స్ లోనే నివాసం ఉంటున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఒక నెల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దిరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ప్రకాష్ భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడు. ఎలాంటి కారణం లేకుండానే అతడు భార్యను హింసించేవాడు. రాత్రి సమయంలో కూడా ఇంటికి రాకుండా ఉండేవాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో అతడు ఏకాంతంగా ఉన్న ఫొటోలను తన స్నేహితులకు చూపించేవాడని.. భర్త పెట్టే బాధలను భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినా పట్టించుకోలేదని బాధితురాలు పేర్కొంది.
అయితే ఇటీవల తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఎలాగైనా ఈ విషయాన్ని బయట పెట్టాలని.. రెడ్ హ్యాండెడ్ గా తన భర్తను పట్టుకోవాలని అనుకుంది. దీనిలో భాగంగానే రాత్రి త్రివేణి తన కుటుంబ సభ్యులతో కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాష్, మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రకాష్‌ను, మహిళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. తనను మోసం చేశాడని.. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ పోలీసులను కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Extramarital affairs, Telangana