• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD KOTI ENT HOSPITAL AS NODAL CENTRE FOR TREAT BLACK FUNGUS CASES SU

Black Fungus కేసులపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. చికిత్స కోసం నోడల్ కేంద్రం ఏర్పాటు..

Black Fungus కేసులపై తెలంగాణ సర్కార్ అలర్ట్.. చికిత్స కోసం నోడల్ కేంద్రం ఏర్పాటు..

ప్రతీకాత్మక చిత్రం

బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిని మృత్యువు వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి.

  • Share this:
    తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిని బ్లాక్ ఫంగస్ కేసుల నోడల్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో కొందరికే ఈ సమస్య వస్తోందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ వెల్లడించింది. బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డుతున్న వారిలో ఈఎన్‌టీ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయని పేర్కొంది. బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన కరోనా బాధితులకు గాంధీలో చికిత్స అందించనున్నట్టు తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న బ్లాక్ ఫంగస్ బాధితులకు కోఠిలోని ఈఎన్‌టీలో చికిల్స అందిస్తామని చెప్పింది. బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు వాడే ఔషధాలను సమకూర్చాలని ఈ మేరకు టీఎస్‌ఎంఐడీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

    ఇక, బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స అందించేందుకు ఆప్త‌మాల‌జీ వైద్యుడి అవ‌స‌రం ఉంటే స‌రోజిని దేవీ ఆస్ప‌త్రిలో చికిత్స అందించ‌నున్నారు. గాంధీ ఆస్పత్రి, సరోజినీదేవి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు పరస్పరం సమన్వయంతో బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.

    ఇక, బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిని మృత్యువు వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్‌ ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్‌మైకోసిస్‌ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే (వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి) సోకుతుంది. ఇది సోకితే... శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది. దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే... వొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, స్టెరాయిడ్లు వాడే వారికి, ICUలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకగలదు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు