హోమ్ /వార్తలు /తెలంగాణ /

బ్రేకింగ్ న్యూస్: కోమటిరెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

బ్రేకింగ్ న్యూస్: కోమటిరెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి, కొండా సురేఖ (ఫైల్ ఫోటో)

కోమటిరెడ్డి, కొండా సురేఖ (ఫైల్ ఫోటో)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy)పై అదే పార్టీకి చెందిన కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy)పై అదే పార్టీకి చెందిన కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసి పని చేయకపోవడం వల్ల ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పటికైనా కలిసికట్టుగా పని చేయాలి. అలాగే పార్టీకి నష్టం చేకూర్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొండా సురేఖ వ్యాఖ్యలు (Konda Surekha) రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Breaking News: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు..ఎప్పుడంటే?

ఇదిలా ఉంటే నిన్న కాంగ్రెస్ కొత్త ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే తెలంగాణకు వచ్చారు. ఈ క్రమంలో గాంధీభవన్ లో పలువురు కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. చాలా రోజుల తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat reddy) కూడా గాంధీభవన్ కు వచ్చారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీతో కోమటిరెడ్డి, రేవంత్ మధ్య సయోధ్య కుదిరింది. వెంకట్ రెడ్డి మనసు మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అయింది. ఈ సమయంలో కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి.

పోలీస్ స్టేషన్ నుండే బైక్ తో పరారైన యువకుడు..వెంబడించిన కానిస్టేబుల్..చివరకు ఏం జరిగిందంటే?

ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) లో కొత్త కమిటీలు కల్లోలం రేపాయి. ఇటీవల AICC రిలీజ్ చేసిన లిస్ట్ లో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ (Konda Surekha) రాజీనామా చేశారు. ఇది తనను అవమానించడమే అని పదవులు ముఖ్యం కాదు ఆత్మభిమానం ముఖ్యం అని కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy)కి కు బహిరంగ లేఖ రాశారు. కొత్త కమిటీలో వరంగల్ నేతల పేర్లు లేకపోవడం బాధ కలిగించిందని కొండా సురేఖ (Konda Surekha) అన్నారు.

కాగా ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలి. పీసీసీ పీఠంపై ఎవరున్నారనేది చూడాలి కానీ అతను ఏ పార్టీ నుంచి వచ్చారనేది చూడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి తీరని అన్యాయం జరిగింది. ఆయన హయాంలోనే కాంగ్రెస్ దిగజారుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు కోమటిరెడ్డిపై వ్యాఖ్యలు దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి.

First published:

Tags: Congress, Komatireddy venkat reddy, Konda surekha, Telangana, TS Congress

ఉత్తమ కథలు