హోమ్ /వార్తలు /తెలంగాణ /

నేడు ఢిల్లీకి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ..!

నేడు ఢిల్లీకి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ..!

komati reddy venkat reddy summouned by party high command

komati reddy venkat reddy summouned by party high command

ప్రియాంక గాంధీతో భేటీ కానున్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. టీవల టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అంతర్గత విబేధాలపై ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ టీ కాంగ్రెస్ నేతలతో చర్చించారు. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India

  Telangana:   ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి  ను ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చినా పార్టీ హైకమాండ్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ ఢిల్లీకి చేరుకున్నారు. వీరు ఈరోజు మధ్యాహ్నం ప్రియాంక గాంధీతో భేటీ  అయ్యే అవకాశాలు  ఉన్నాయి. ఇటీవల టీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక, పార్టీలో అంతర్గత విబేధాలపై ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ టీ కాంగ్రెస్ నేతలతో చర్చించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆయన భేటీకి హాజరుకాలేదని సమాచారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రియాంక గాంధీతో  భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రియాంకతో భేటీలో రేవంత్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విభేదాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.


  రేవంత్ చేసిన హోంగార్డు కామెంట్స్, చండూరు సభలో చేసిన కామెంట్స్‌కు సంబంధించి అద్దంకి దయాకర్‌పై చర్యలు, పార్టీలో సీనియర్లను పట్టించుకోకపోవడం, వీటిపై ప్రియాంక గాంధీ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చర్చించే  అవకాశాలున్నాయని విశ్లేషణ. గతంలో వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి సోనియా గాంధీకి రాసిన లేఖలో కూడా  అతనితో కలిసి సమావేశంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.


  Read this also ; Mulugu: జానపద గేయాలు పురుడు పోసుకుంది ఎక్కడో తెలుసా..! తెలిస్తే ఆశ్చర్యపోతారు..!


  రేవంత్‌రెడ్డి తీరు సీనియర్ నాయకులను అవమానించేలా ఉందంటూ వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. తన కుటుంబాన్ని కించపర్చేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కూడా లేఖలో  ప్రస్తావించారు.  ఇలాంటి విషయాలపై ప్రస్తావిస్తారని విశ్లేషణ. ఈ కారణంగాన తాను ఇవాాళ జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా చెప్పారు. తన నియోజకవర్గంలో ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.  Read this also ; Vijayawada: సోషల్ మీడియాలో పరిచయం.. మహిళకు వేధింపులు.. వైసీపీ నేతపై ఆరోపణలు.. అసలు స్టోరీ ఇదే..!


  ఇదిలా ఉంటే, సమావేశంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రియాంక గాంధీ అవగాహన కల్పించేందుకు ఐక్యంగా, క్రమశిక్షణతో పని చేయాలని వారికి సూచించారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Congress, Komatireddy venkat reddy, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు