Home /News /telangana /

HYDERABAD KHAMMAM MP NAMA NAGESWARA RAO SON PRITHVITHEJ WAS ATTACKED BY THUGS IN HYDERABAD AND TOOK MONEY SNR

Hyderabad | Crime : TRS ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై ఎటాక్ .. కారులోనే నరకం చూపించిన దుండగులు

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

Hyderabad | Crime : హైదరాబాద్‌ మహానగరంలో అసాంఘీక శక్తులు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కొడుకు కారులో వెళ్తుంటే ఆపడమే కాకుండా బలవంతంగా అందులో ఎక్కి అతనిపై దాడి చేసి డబ్బులు దోచుకోవడం సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...
హైదరాబాద్‌ (Hyderabad)మహానగరంలో అసాంఘీక శక్తులు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ కొడుకు కారులో వెళ్తుంటే ఆపడమే కాకుండా బలవంతంగా అందులో ఎక్కి అతనిపై దాడి చేసి డబ్బులు కాజేశారు. అతని ప్రాణాలను సైతం తీయడానికి సిద్ధపడటంతో అతను తప్పించుకున్నాడు. హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఎవరో కాదు ఖమ్మం ఎంపీ(Khammam MP)నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)కుమారుడు నామా పృధ్వీతేజ్(Prithvithej). నాలుగు రోజుల క్రితం జరిగిన ఈఘటనపై బాధితుడే స్వయంగా పంజాగుట్ట(Panjagutta)పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో సంచలనంగా మారింది.

KCR | KTR : కేసీఆర్, కేటీఆర్‌కు ఘోర అవమానం.. నాడు మొక్క..నేడు బిందె మాయం


ఎంపీ కొడుకుపై అటాక్..
టీఆర్ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడు నామా పృధ్వీపై శనివారం రాత్రి దాడి జరిగింది. నామా పృధ్వీతేజ్ టౌలిచౌకిలో ఉంటున్న ఫ్రెండ్‌ని కలవడానికి కారులో వెళ్లిన టైమ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఐదుగురు అటాక్ చేశారు. ముందుగా ఇద్దరు వ్యక్తులు టోలిచౌకీలో పృధ్వీతేజ్‌ కారుని బైక్‌ అడ్డుపెట్టి ఆపారు. వెంటనే కారులో ఎక్కారు. డ్రైవింగ్ సీటులో కూర్చున్న పృధ్వీ మెడపై కత్తి పెట్టి తాము చెప్పినట్లుగా చేయమన్నారు. కారును కొండాపూర్‌ వైపుకు తీసుకెళ్లారు. మార్గం మధ్యలోనే మరో ఇద్దర్ని కారులో ఎక్కించుకున్నారు. నలుగురు కారులో ఎక్కిన తర్వాత గచ్చిబౌలి దగ్గర మద్యం తాగి పృధ్వీతేజ్‌ను కొట్టినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పృధ్వీ తప్పించుకోవడానికి వీల్లేకుండా అందరూ కలిసి కారులోనే అతడ్ని నిర్భందించారు. పృధ్వీతేజ్‌ బ్యాంక్ అకౌంట్‌ నుంచి తమ ఖాతాలోకి 75వేల రూపాయలను బలవంతంగా ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ టోలీచౌకి, మహదీపట్నం ఖైరతాబాద్, రాజ్‌భవన్‌ మీదుగా ఎస్‌ఆర్‌నగర్‌ చేరుకున్నారు.ప్రాణాలకు తెగించి ఎస్కేప్..
దుండగులు ఓవైపు భయపెడుతూ ఉన్న క్రమంలోనే పృధ్వీతేజ్ కారుతో ఓ బైక్‌కి ఢీకొట్టాడు. అప్పటి కూడా లోపలున్న దుండగులు ఎంపీ కొడుకును వదిలిపెట్టలేదు. మళ్లీ కారును టోలీచౌకి పోనివ్వమని ఆదేశించారు. మొత్తం ఐదుగురు వ్యక్తులు కారులో కూర్చొని తన మెడపై కత్తి పెట్టడంతో వాళ్లు చెప్పినట్లు చేసిన పృధ్వీతేజ్‌ తనను ఏదైనా చేస్తారనే ముందుచూపుతోనే కారు పంజాగుట్ట ప్రాంతంలో కారులోంచి బయటకు దూకి పారిపోయాడు.

Naga Panchami : అక్కడ పాముకు పోసిన తర్వాత మిగిలిన పాలతో అన్న, తమ్ముళ్ల కళ్లు కడుగుతారు .. ఎందుకంటే ..?


దుండగుల కోసం గాలింపు..
ప్రాణాలతో బయటపడ్డ ఎంపీ కొడుకు నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నెంబర్‌ ఆధారంగా దుండగులు నామా పృధ్వీతేజ్‌ను కారు తీసుకెళ్లిన మార్గంలోని సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. మరోవైపు అన్నీ పోలీస్‌ స్టేషన్‌లకు అలర్ట్ చేశారు. టోలిచౌకి దగ్గర కారును ఆపిన ప్రదేశంలో కూడా సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. నిందితులను గుర్తించేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad crime, Nama Nageshwara Rao

తదుపరి వార్తలు