• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD KHAIRATHABAD LORD GANESHA KARRA PUJA ALL READY STARTS THIS YEAR NOT CLARITY ON HEIGHT NGS

Jai Ganesh: ఖైరతాబాద్ లో ఏకాదశ రుద్ర మహా గణపతి.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఖైరతాబాద్ గణపతిపై కరోనా ప్రభావం

ఖైరతాబాద్ గణపతి అంటే అందరికీ తెలిసింది భారీగా ఎత్తైన రూపమే.. కానీ కరోనా కారణంగా భారీ వినాయకుడ్ని చూసే బాగ్యం కలగడం లేదు. ప్రస్తుతానికి గణపతి ఎత్తు ఎంతో చెప్పకపోయిన.. విగ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందంటున్నారు నిర్వాహకులు.

  • Share this:
    వినాయక చవితి వస్తోంది అంటే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. అయితే వరుసగా రెండో ఏడాది ఈ భారీ గరణపతిపై కరోనా ఎఫెక్ట్ పడింది. గత ఏడాది కూడా భారీ ఎత్తున విగ్రహం తయారు చేయించాలని గణేష్ ఉత్సవ సమితి భావించినా కరోనా కరాణంగా అది సాధ్యం కాలేదు. వరుసగా రెండో ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే పూజలకు మాత్రం ఏ లోటు లేకుండా ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సిద్ధమైంది. ఈ సారి ఖైరతాబాద్‌ గణేశుడు.. శ్రీ ఏకాదశ రుద్ర మహా గణపతిగా ముస్తాబై పూజలందుకోనున్నాడు. నిర్జల ఏకాదశి సందర్భంగా సోమవారం ఉత్సవ కమిటీ నిర్వాహకులు గణపతి ప్రాంగణంలో ఆనవాయితీగా షెడ్డు నిర్మాణం కోసం కర్ర పూజ నిర్వహించారు.

    గౌరీభట్ల విఠలశర్మ సిద్ధాంతి సూచన మేరకు ఏకాదశ రుద్ర మహా గణపతి ప్రతిష్ఠాపనకు నిర్ణయించినట్లు శిల్పి రాజేంద్రన్‌, ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌ తెలిపారు. కానీ గణపతిని ఈ సారి 27 అడుగుల ఎత్తుతో చేయాలని భావిస్తున్నా.. పోలీసు అనుమతులు, కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎత్తుపై నిర్ణయం తీసుకుంటామని ఉత్సవ కమిటీ తెలిపింది. సెప్టెంబర్‌ 10కల్లా గణపతిని పూజలకు సిద్ధం చేస్తామని పేర్కొంది.

    ఇదీ చదవండి: టీఆర్ఎస్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షాక్ తింటున్న రాజకీయ పార్టీలు

    గత ఏడాది కూడా తీవ్ర తర్జన భర్జనల మద్య గణపతిని ప్రతిష్టించారు. కరోనా ప్రభావం కారణంగా కేవలం 18 అడుగుల ఎత్తులో శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా నామకరణం చేసి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలనుకున్నా కరోనా సెకండ్‌ వేవ్‌తో ఖైరతాబాద్‌ మహాగణపతి తయారీపై సందిగ్ధత నెలకొంది. పరిస్థితులు అదుపులోకి రావడంతో మహాగణపతి తయారీకి కర్రపూజ నిర్వహించారు.

    ఇదీ చదవండి: మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి.. కేసీఆర్, జగన్ దారి ఎటు..? చంద్రబాబు పరిస్థితి?

    ఈసారి మహాగణపతి ఎత్తు, నమూనాపై త్వరలో ప్రకటన చేస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 10న వినాయకచవితి ఉందని, 11 తలలతో నిలబడి ఉండే ఆకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. 11 తలల రుద్ర మహా గణపతి అంటే శివుడి అంశంతో చాలా ప్రత్యేకంగా ఈ సారి విగ్రహం కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ తో పాటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతానికైతే వినాయక చవితికి ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ కరోనా థర్డ్ వేవ్ హెచ్చిరకలు నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published: