Home /News /telangana /

HYDERABAD KHAIRATABAD GANESH 2021 NIMAJJAN COMPLEATS IN HUSSAIN SAGAR OF HYDERABAD VB

Ganesh Immersion: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేషుడు.. సంతోషంతో వెనుతిరుగుతున్న భక్తులు..

గణేశ్ నిమజ్జనం

గణేశ్ నిమజ్జనం

Ganesh Immersion: ఖైరతాబాద్‌ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు.

    ఖైరతాబాద్ వినాయక విగ్రహం నిమజ్జనం ఆదివారం మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో చేశారు. క్రేన్ నెంబరు 4 వద్ద మహా గణపతి నిమజ్జనం జరిగింది. నవరాత్రుల పాటు భక్తుల ప్రత్యేక పూజలందుకున్న గౌరీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన మహాగణపతి శోభయాత్ర ఖైరతాబాద్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు సాగింది. ఇక్కడ చివరిసారిగా నిర్వాహకులు పంచముఖ రుద్ర మహాగణపతికి పూజలు నిర్వహించారు. పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ఆదివారం ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైంది. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర సందడిగా సాగింది.

    Ganesh immersion : ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర.. ట్రాలీపైకి ఖైరతాబాద్ వినాయకుడు.. బాలాపూర్‌లో లడ్డు వేలం  


    పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ఆదివారం ఉదయం  ప్రారంభమైంది. భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర సందడిగా సాగింది. ట్యాంక్‌ బండ్‌పై తుది పూజల అనంతరం మహా గణపతి నిమజ్జనం కోసం తరలింది. నిమజ్జనం కోసం ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేసిన 4వ నెంబరు క్రేన్‌‌‌ను కేటాయించారు. చివరి రోజు మహా గణపతి దర్శనం కోసం ట్యాంక్ బండ్‌కు భారీగా భక్తులు తరలివచ్చారు. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ మళ్లించారు. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

    Balapur laddu Auction : బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.18.90 లక్షలకు దక్కించుకున్న తెలంగాణ, ఏపీలకు చెందిన భక్తులు..


    మొదట టెలిఫోన్‌ భవన్‌ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌పైకి శోభాయాత్ర సాగనుంది. మొత్తం 2.5 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. ట్యాంక్‌ బండ్‌పై 4వ నంబర్‌ క్రేన్‌ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మహా గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది భక్తులకు మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల మధ్య గణనాథుని నిమజ్జనం ముగిసింది. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి.. 1994 నుంచి ప్రతి ఏడాది బాలాపూర్ వినాయకుడి(Balapur Ganesh) లడ్డును వేలం వేస్తు వస్తున్న సంగతి తెలిసిందే.

    Balapur laddu Auction : బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.18.90 లక్షలకు దక్కించుకున్న తెలంగాణ, ఏపీలకు చెందిన భక్తులు..


    అయితే ఇక్కడ లడ్డు ధర ప్రతి ఏడాది రికార్డు ధర పలుకుతూ వచ్చింది. అయితే కరోనా కారణంగా గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం (Balapur Ganesh laddu auction) వేయలేదు. గత ముప్పై ఏళ్లలో బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలానికి ఉంచకపోవడం అదే తొలిసారి. అయితే ఈ ఏడాది బాలాపూర్ లడ్డును వేలం వేయనున్నట్టుగా బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు చెప్పారు. ఇక, 2019లో బాలాపూర్ లడ్డు వేలంలో రూ. 17.60 లక్షలు పలుకగా.. ఈ సారి ఆ మొత్తం 18.90 లక్షలకు పలికింది.  దీనిని కడప ఎమ్మెల్సీ దక్కించుకున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Ganesh Chaturthi 2021, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు