గణేశ్ నవరాత్రి ఉత్సవాల(Ganesh Chaturthi) సందర్భంగా.. చాలా మంది దృష్టి ఖైరతాబాద్ వినాయకుడి(Khairatabad Ganesh) మీదే ఉంటుంది. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ వెళ్లారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గతేడాది కరోనా కారణంగా వినాయక విగ్రహాం ఎత్తున తగ్గిస్తూ నిర్ణయం తీసుకన్నారు. ఇక, ఈ ఏడాది 40 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిని ప్రతిష్టించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఖైరతాబాద్ గణనాథుడి కోసం అంతే స్థాయిలో భారీ లడ్డూను చేయిస్తారు నిర్వాహకులు. ఈ లడ్డును సాధారణంగా భక్తులకు పంపిణీ చేస్తుంటారు. ఈ ప్రసాదం కోసం వేల సంఖ్యలో భక్తులు రావడం ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. కొన్ని సార్లు వర్షాలకు తడిసి లడ్డు పాడైన సందర్భాలు ఉన్నాయి.
ఇక, గత 11 ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పీవీవీఎస్ మల్లికార్జునరావు (PVVS Mallikarajuna Rao) అలియాస్ మల్లిబాబు.. ఖైరతాబాద్ గణపతి(Khairatabad Ganesh) కోసం భారీ లడ్డూను నైవేద్యంగా పంపుతున్నారు. 2010 నుంచి ఆయన ఖైరతాబాద్ గణనాథునికి లడ్డును పంపిస్తున్నారు. ఈ లడ్డును చాలా భక్తి శ్రద్దలతో తయారు చేయించేవారు. వినాయక నిమజ్జనం తర్వాత మల్లిబాబు తాను సమర్పించిన లడ్డూలో కొంత భాగాన్ని ప్రసాదంగా తీసుకునేవారు. మిగతా లడ్డూను నిర్వాహకులు భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టేవారు.
Bhabanipur: భవానీపూర్‌లో మమతా బెనర్జీని వర్సెస్ ప్రియాంక.. ఇంతకీ ఆమె ఎవరంటే..?
అయితే గతేడాది కూడా తాపేశ్వరం నుంచి ఖైరతాబాద్ గణనాథుడికి 100 కిలోల లడ్డును పంపించారు. అయితే గత 11 ఏళ్లుగా కొనసాగిన సంప్రదాయానికి ఈ ఏడాది బ్రేక్ పడింది. ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడికి తాపేశ్వరం నుంచి లడ్డను తీసుకురావడం లేదు. ఈ ఏడాది హైదరాబాద్ వాసీల నుంచి 2000 కేజీల లడ్డును(Khairatabad Ganesh laddu prasadam) తయారు చేయించారు. ఈ ఏడాది వినాయక స్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్స్ యజమాని శ్రీకాంత్ నుంచి 1100 కేజీల లడ్డును లంబదోదరుడి కోసం సిద్ధం చేశారు. భక్తాంజనేయ స్వీట్ నుంచి 900 కేజీల లడ్డును స్వామివారి సమర్పించనున్నారు. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య లడ్డులను ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు చేర్చనున్నారు.
ఈ సారి బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం..
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి.. 1994 నుంచి ప్రతి ఏడాది బాలాపూర్ వినాయకుడి(Balapur Ganesh) లడ్డును వేలం వేస్తు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ లడ్డు ధర ప్రతి ఏడాది రికార్డు ధర పలుకుతూ వచ్చింది. అయితే కరోనా కారణంగా గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలం (Balapur Ganesh laddu auction) వేయలేదు. గత ముప్పై ఏళ్లలో బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలానికి ఉంచకపోవడం అదే తొలిసారి. అయితే ఈ ఏడాది బాలాపూర్ లడ్డును వేలం వేయనున్నట్టుగా బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు చెప్పారు. ఇక, 2019లో బాలాపూర్ లడ్డు వేలంలో రూ. 17.60 లక్షలు పలుకగా.. ఈ సారి ఆ మొత్తం మరింతగా పెరుగుతుందని వారు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2021, Hyderabad, Khairatabad ganesh, Laddu