హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం..BL సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం..BL సంతోష్ కు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామికి సిట్ నోటిసులపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్టే విధించింది. ఇది ముచ్చటగా మూడోసారి కావడం గమనార్హం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రెండు సార్లు బీజేపీ అగ్రనేత BL సంతోష్, జగ్గుస్వామికి సిట్ నోటిసులపై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) స్టే విధించింది. ఇక ముచ్చటగా మూడోసారి కూడా హైకోర్టు స్టేను పొడిగించింది. ఇటీవల దాఖలైన పిటీషన్లను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపి డిసెంబర్ 22 వరకు సిట్ నోటీసులపై స్టే విధించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ నిందితులతో మాట్లాడినట్టు సిట్ వాదిస్తుంది. అందుకే సంతోష్ ను విచారిస్తే కీలక విషయాలు బయటకు రానున్నాయి. దీనితో సంతోష్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత నెల 26న లేదా 28న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై బిఎల్ సంతోష్ హైకోర్టును అశ్రయించగా ఇప్పటికే రేండు సార్లు సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది. ఇక ఇప్పుడు కూడా అదే జరగడంతో ముచ్చటగా మూడోసారి స్టే పొడిగించింది కోర్టు.  మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Kidnap Case: వైశాలి-నవీన్ మధ్య అసలేం జరిగింది?..పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు..

ఇక హైకోర్టు ఆదేశాలతో సిట్ అధికారులు ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుత నోటీసులపై కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో కొత్త నోటీసులు ఇవ్వాలని చూస్తుంది కానీ ఇప్పటికే ఇచ్చిన నోటిసులపై కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ నోటీసులు ఇవ్వలేరని సీనియర్ న్యాయవాది చెబుతున్నారు. కానీ ఈ నోటీసులపై స్టే ఉంది కాబట్టి దీనిపై ముందుకెళ్లడానికి మళ్లీ నోటీసులు ఇవ్వాలని సిట్ చూస్తుంది. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

కల్వకుంట్ల కవిత వర్సెస్ బండి సంజయ్ ..ఆ వ్యాఖ్యలకు బండి రియాక్షన్ ఇలా..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ (BL Santosh), బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ సునీల్ బన్సల్ (Sunil bunsal), తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ (Tarun chugh) తెలంగాణాకు రానున్నట్టు తెలుస్తుంది. ఈనెల 28న బీజేపీ అగ్రనాయకులు హైదరాబాద్ (Hyderabad) రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ అందులో భాగంగా 28,29 తేదీల్లో బీజేపీ నాయకులకి ఇక్కడే మకాం వేయనున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకులు మూకుమ్మడిగా తెలంగాణకు రావడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.

ఎమ్మెల్యేల బేరసారాల కేసులో కూడా అమిత్ షా, BL సంతోష్ పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి వారి రాక కాక రేపుతోంది.

First published:

Tags: Bjp, High Court, Highcourt, Hyderabad, Telangana, Telangana High Court, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు