హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కు చుక్కెదురు..ఆ పిటీషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కు చుక్కెదురు..ఆ పిటీషన్ ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

సిట్ కు షాక్!

సిట్ కు షాక్!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)కు మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో కూడా సిట్ కు మరోసారి చుక్కెదురయ్యింది.పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)కు మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించింది. కానీ హైకోర్టులో కూడా సిట్ కు మరోసారి చుక్కెదురయ్యింది. కాగా ఈ కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామీ, తుషార్, శ్రీనివాస్ లను నిందితులుగా చేరుస్తు సిట్ ఏసీబీ కోర్టులో ఇటీవల మెమో దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు సిట్ దర్యాప్తు చెల్లదు. ఈ కేసును సిట్ దర్యాప్తు చేయడం ఏంటని ప్రశ్నిస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. అయితే దీనిపై సిట్ హైకోర్టుకు వెళ్ళింది. కానీ హైకోర్టులో కూడా సిట్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు తీర్పును సమర్ధిస్తూ..సిట్ వేసిన పిటీషన్ ను కొట్టివేసింది.

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం

గతంలో ఏసీబీ కోర్టు ఏమన్నదంటే?

ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిట్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడా చుక్కెదురైంది.మరి సిట్ నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోనుందో చూడాలి.

Telangana politics: అలా జరిగితే ..రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సిట్ దర్యాప్తు నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక తాజాగా హైకోర్టు తీర్పు కాపీ సీబీఐకి చేరింది. 98 పేజీలతో కూడిన ఈ తీర్పు కాపీలో కోర్టు కీలక విషయాలు ప్రస్తావించింది. ఈ కేసు సిట్ నుండి సీబీఐకి అప్పగించడానికి మొత్తం 45 కారణాలను కోర్టు పేర్కొంది. ఇక ఆర్డర్ కాపీ సీబీఐకి చేరడంతో రానున్న రోజుల్లో కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ నెక్స్ట్ ఎవరిని విచారిస్తుంది? ఎలా ముందుకెళ్లబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ ఎంట్రీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే సిట్ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వీడియోలకు సంబంధించి పెన్ డ్రైవ్ లు, మ్యానువల్ పేపర్స్ సహా మిగతా అన్ని వివరాలు సీబీఐకి హ్యాండోవర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేయనుంది. ఈ విచారణ జరిగే వరకు సీబీఐ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి.

First published:

Tags: BRS, High Court, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు