హోమ్ /వార్తలు /తెలంగాణ /

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం..పోలీస్ కస్టడీకి నిందితుడు నవీన్ రెడ్డి

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం..పోలీస్ కస్టడీకి నిందితుడు నవీన్ రెడ్డి

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు

ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని మన్నెగూడలో పట్టపగలు నవీన్ రెడ్డి అనే వ్యక్తి 100 మందితో వైశాలి ఇంటికొచ్చి ఆమె కుటుంబసభ్యులను కొట్టి యువతిని అపహరించుకెళ్ళాడు. ప్రేమించిన అమ్మాయి మరొక పెళ్లికి సిద్ధపడిందని యువతి ప్రియుడు నవీన్ సినిమా లెవల్లో కిడ్నాప్ వ్యవహారాన్ని నడిపాడు. తాజాగా ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసుల కస్టడీలోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలన్న పోలీసుల విజ్ఞప్తిని ఇబ్రహీంపట్నం కోర్టు ఆంగీకరించింది.

Bhadradri Kothagudem: బోరు లేదు.. బావి లేదు.. భూమిలో నుంచి ఉబికి వస్తున్న నీళ్లు

కాగా ఈ కేసులో నవీన్ తో పాటు మరో ఐదుగురికి 14 రోజుల పాటు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 38 మందిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి హైదరాబాద్ కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అతడి కస్టడీని కోర్టు పొడిగించింది. దీనితో వారిని చంచల్ గూడ తరలించారు.

Warangal: అధికారుల నిర్లక్ష్యం.. చిన్న నిప్పు పడితే ఆహుతవ్వాల్సిందేనా!

అసలు వైశాలితో నవీన్ కు పరిచయం ఎలా ఏర్పడింది?

గతేడాది బొంగుళూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలితో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వైశాలి ఫోన్ నెంబర్ తీసుకున్న నవీన్ తరచూ కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. కాస్త పరిచయం పెరగడంతో ఆమెతో కలిసి నవీన్ ఫోటోలు తీసుకున్నాడు. ఈ క్రమంలో వైశాలిని పెళ్లి చేసుకోవాలనే ఆశ నవీన్ లో పుట్టుకొచ్చింది. దీనితో వైశాలి ముందు నవీన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే వైశాలి తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని నవీన్ కు చెప్పింది. ఈ క్రమంలోనే వైశాలిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు నవీన్ చెప్పుకొచ్చాడు. కానీ వైశాలి తల్లిందండ్రులు మాత్రం నవీన్ తో పెళ్ళికి ససేమిరా అన్నారు. ఇది మనసులో పెట్టుకున్న నవీన్ వైశాలి తల్లి దండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశాడు. ఆ ఖాతాలో గతంలో వైశాలితో దిగిన ఫోటీలను నవీన్ వైరల్ చేశాడు. అలాగే వైశాలి ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకున్న నవీన్ గణేష్ నిమజ్జనం సందర్బంగా వైశాలి ఇంటి ముందు స్నేహితులతో కలిసి నానా హంగామా చేశాడు. దీనిపై యువతి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad: ఒక్కసారిగా కుప్పకూలిపోయిన నాలా... కూరుకుపోయిన కార్లు, బైకులు, దుకాణాలు

నిశ్చితార్ధం జరుగుతుందనే ఇదంతా..

డిసెంబర్ 9న వైశాలికి మరో యువతితో నిచ్చితార్ధం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న నవీన్ పక్కా ప్లాన్ వేశాడు. యువతిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు, టీ షాప్ లో పని చేసే యువకుల సాయంతో యువతి ఇంటికి చేరుకున్నాడు నవీన్. ఇంటి ముందు కార్లను ధ్వంసం చేసి వైశాలి కుటుంబసభ్యులను కొట్టి వైశాలిని ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డివిఆర్ లను కారులో ఎత్తుకెళ్లాడు. కారులో నల్గొండ వైపు వెళ్తున్న నవీన్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి నల్గొండ వద్ద నవీన్ రెడ్డి, అతని స్నేహితులు కారు దిగి వెళ్లిపోయారు. ఇక నవీన్ మరో స్నేహితుడు వైశాలిని వోల్వో కారులో హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. డిసెంబర్ 9నే వైశాలి తన తల్లిదండ్రులకు క్షేమంగానే ఉన్నానని ఫోన్ చేసింది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 38 మందిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరి రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

First published:

Tags: Hyderabad, Kidnap, Telangana

ఉత్తమ కథలు