ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో సంచలనాలు బయటకు వస్తున్నాయి. మొన్న రిమాండ్ రిపోర్టులో ఈడీ (Enforcement Directorate) కవిత (MLC kavita) పేరు చేర్చడం, నిన్న సీబీఐ కవితకు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ కుంభకోణంలో ప్రముఖ రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)కు సంబంధించి అవినీతిపై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్ మద్యం పాలసీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఈ లిక్కర్ స్కాంతో (Delhi Liquor Scam) తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.
రిమాండ్ రిపోర్టులో కవిత పేరు..సీబీఐ నోటీసులు
ఇక అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి నిన్న సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని అధికారులు CRPC 160 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో ఎక్కడైనా విచారణకు హాజరు కావొచ్చని సీబీఐ తెలిపింది. నిన్న ఇచ్చిన సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) స్పందించారు. తాను విచారణకు సిద్ధం అని అయితే హైదరాబాద్ లోని తన ఇంట్లోనే సిబిఐకి వివరణ ఇస్తా అని తెలిపారు. డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు అవుతానని ఆమె (MLC Kavita) తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత (MLC Kavita) ఇంటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కవిత ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కేసీఆర్ తో కవిత ఏం చర్చించారు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చడం, సీబీఐ నోటీసులు ఇవ్వడంతో కవిత అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో కవిత (MLC Kavita) ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ (CM KCR) తో భేటీ అయ్యారు. కేసీఆర్ (CM KCR) తో కవిత (MLC Kavita) భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఏయే అంశాలు చర్చించారు. కేసీఆర్ (CM KCR) ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనే విషయంపై ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Telangana News