హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister Mallareddy: ఐటీ రైడ్స్ విషయం కేసీఆర్ ముందే చెప్పారు..మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Minister Mallareddy: ఐటీ రైడ్స్ విషయం కేసీఆర్ ముందే చెప్పారు..మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

మంత్రి మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి

తన నివాసాల్లో జరిగిన ఐటీ రైడ్స్ పై మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఐటీ రైడ్స్ పై మీడియా సమావేశం నిర్వహించిన మల్లారెడ్డి ఐటీ అధికారులపై, కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఐటీ రైడ్స్ విషయం కేసీఆర్ ముందే చెప్పారని, బీజేపీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ వెంట సీఎం కేసీఆర్ ఉన్నారని ఎవరు ఏం చేయలేరని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తన నివాసాల్లో జరిగిన ఐటీ రైడ్స్ పై మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) సెన్సేషనల్ కామెంట్స్ (Sensational Comments) చేశారు. ఐటీ రైడ్స్ పై మీడియా సమావేశం నిర్వహించిన మల్లారెడ్డి  (Minister Mallareddy) ఐటీ అధికారులపై, కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఐటీ రైడ్స్ విషయం సీఎం కేసీఆర్ (Cm Kcr) ముందే చెప్పారని, బీజేపీకి భయపడే ప్రసక్తే లేదన్నారు. తమ వెంట సీఎం కేసీఆర్  (Cm Kcr) ఉన్నారని ఎవరు ఏం చేయలేరని మల్లారెడ్డి  (Minister Mallareddy) వ్యాఖ్యానించారు.

  KCR: టీఆర్ఎస్‌తో కమ్యూనికేషన్ గ్యాప్.. సీపీఐ నేత కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ పట్టించుకోవడం లేదా ?

  కేసీఆర్ మా దైర్యం..బీజేపీ ఏం చేయలేదు..

  మూడు నెలలుగా మాపై ఫోకస్ పెట్టారు. కానీ నా దగ్గర, నా కొడుకుల దగ్గర కేవలం రూ.28 లక్షలు మాత్రమే దొరికాయి. మా అటెండర్ ఇంటికి కూడా వెళ్లారు. నా ఇంటిపై రైడ్స్ జరగడం ఇది కొత్త కాదు. ఈ దాడి హ్యాట్రిక్ ది. ఇలాంటి దాడులు జరుగుతాయని కేసీఆర్ ముందే చెప్పారు. బీజేపీ వాళ్లకు భయపడేది లేదు. మాకు అండగా కేసీఆర్ (Cm Kcr) ఉన్నారు. ఆయనే మా దైర్యం అని మల్లారెడ్డి  (Minister Mallareddy) అన్నారు.

  Breaking News: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి భారీ షాక్..ఎట్టకేలకు ఆ ముగ్గురిపై కేసు నమోదు

  దుమ్ము దులిపారన్న మల్లన్న..

  తన నివాసాల్లో, బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు దాడి చేసి దుమ్ముదులిపారన్నారు మల్లారెడ్డి (Minister Mallareddy). ఇంతమంది పోలీసులు, అధికారులు కలిసి ఏం రాబట్టారు. ఇప్పటికే సినిమా అయిపోలేదు. ఇప్పటివరకు ఐటీ అధికారులు రైడ్స్ తో వేధించారు. ఇక ఇప్పుడు మరో 3 నెలలు విచారణ పేరుతో వేధిస్తారు. వందల కోట్లు దొరుకుతాయని అధికారులు వచ్చారు. కానీ దొరికింది ఏమి లేదన్నారు. కానీ ఈ రైడ్స్ తో తనను కేసీఆర్ (Cm Kcr) ను ఏమి చేయలేరని మల్లారెడ్డి  (Minister Mallareddy) అన్నారు.

  పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం..

  తాము వ్యాపారాలు చేయడం లేదని పేద విద్యార్థులకు చదువు చెబుతున్నామన్నారు. అది కూడా రూ.75 వేలకే అని అన్నారు. ఇండియాలో ఎక్కడ లేని కోర్సులను చెబుతున్నామని డాక్టర్లను, ఇంజనీర్లను చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వమే కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తుందని, తాము సీట్ల కోసం డొనేషన్లు తీసుకోవడం లేదని అన్నారు. అంతా ఓపెన్ గానే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఐటీ దాడులని చెప్పి తన కుటుంబసభ్యులను వేధించారని మల్లారెడ్డి ఆరోపణలు చేశారు.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: CM KCR, Hyderabad, Malla Reddy, Mallareddy, Telangana, Telangana News, Trs