హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu | Brs: మునుగోడులో టీఆర్ఎస్‌ కాదు బీఆర్ఎస్‌ పేరుతోనే పోటీ .. ఈసీ ఆమోదం కోసం చివరి వరకు ఎదురుచూపు

Munugodu | Brs: మునుగోడులో టీఆర్ఎస్‌ కాదు బీఆర్ఎస్‌ పేరుతోనే పోటీ .. ఈసీ ఆమోదం కోసం చివరి వరకు ఎదురుచూపు

KCR,EC(FILE)

KCR,EC(FILE)

BRS | KCR: పార్టీ పేరు మారిన తర్వాత కొత్త పేరుతోనే మునుగోడు ఉపఎన్నిక బరిలోకి వెళ్లాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకోసమే ఈసీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు. నామినేషన్‌ గడువు ముగిసే చివరి రోజు వరకు ఎదురుచూడాలని భావిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాష్ట్రంలో రాజకీయం అంతా మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపు కోసం బీజేపీ(BJP), కాంగ్రెస్‌ Congressఇప్పటికే సర్వం సిద్దం చేసుకుంటే ..అధికార పార్టీ మాత్రం అభ్యర్ధి పేరును ప్రకటించలేదు. అంతే కాదు టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్రీయ సమితి (BRS)జాతీయ పార్టీగా మార్చుతూ తీర్మానం చేశారు. పార్టీ పేరు మారిన తర్వాత కొత్త పేరుతోనే మునుగోడు(Munugodu)ఉపఎన్నిక బరిలోకి వెళ్లాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్‌ పార్టీకి అధికారిక గుర్తింపు ఇచ్చిన తర్వాతే అభ్యర్ధిని ప్రకటించి ఆ గుర్తు, అదే పేరుతో పోటీలో నిలవాలని చూస్తోంది. అయితే నామినేషన్ల గడువుకు మరో వారం రోజులు ఉండటంతో అప్పటి వరకు ఎదురుచూసి ఈసీ ఆమోదించిన తర్వాతే బీఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తుందట.

Munugodu : మునుగోడు ఉపఎన్నిక పోటీపై వైఎస్ షర్మిల వెనకడుగు .. ఆ ఒక్క కారణమేనట

కొత్త పేరు ఖరారయ్యే వరకు వెయిటింగ్..

టీఆర్ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారింది. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మరి ఇప్పుడు అక్కడ పోటీ కూడా బీఆర్ఎస్‌తోనే చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈక్రమంలోనే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సైతం కొత్త పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల్లో పోటీ చేయడం కరెక్ట్ అని భావిస్తున్నారట.అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా తీర్మానించిన పేరు బీఆర్ఎస్‌ని ఆమోదిస్తే అదే పేరుతో పోటీ చేయాలని చూస్తున్నారట. శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 14వ తేదీ లోపు బీఆర్ ఎస్ ను అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తే కొత్త పేరుతోనే పోటీలో ఉండాలని సీఏం కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది.

బీఆర్ఎస్‌ పేరుతో బరిలోకి..ఇది ఫిక్స్

మునుగోడు ఎన్నికల గడువులోగా కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో పాత పేరుతోనే పోటీ చేయాలని భావించింది. కాని రెండు, మూడ్రోజుల్లో ఈసీ టీఆర్ఎస్‌కు కొత్త పేరు కేటాయించే అవకాశముందన్న సమాచారంతో నామినేషన్ల చివరి గడువు వరకు వేచి చూడాలని ..ఆ తర్వాతే నామినేషన్ వేయడం, కొత్త గుర్తుతో పోటీ చేయడం జరుగుతుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. మునుగోడులో గెలుస్తామనే ధీమాతో పాటు జాతీయ రాజకీయాల్లో ప్రవేశం జరిగిన వెంటనే కొత్తి పార్టీ పేరుతో తొలి విజయం తమ ఖాతాలో వేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకోసమే అభ్యర్ధి పేరును దాదాపు ఖరారు చేసినప్పటికి ..ప్రకటించడానికి జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ పేరు మారిన వెంటనే బీఆర్ఎస్‌ అభ్యర్ధి అంటూ పేరు ప్రకటించాలని చూస్తున్నారు.

Munugodu : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాగాయకుడు .. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా గద్దర్ ప్రచారం షురూ

గులాబీ బాస్ నిర్ణయం ..

మునుగోడులో టీఆర్ఎస్‌ గెలిచింది ఒకే ఒక్కసారి. అది కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుపై గెలిచారు. నియోజకవర్గంలో ఆయన పరిచయస్తుడు కావడంతో ఈసారి కూడా ఆయన్నే నిలబెట్టాలని ఫిక్సయ్యారట గులాబీ బాస్. అభ్యర్ది పేరు ప్రకటించడంలో జాప్యం అవుతున్నప్పటికి ప్రచారం కోసం అధికారపార్టీ పార్టీ ఇన్ ఛార్జిలను నియోజకవర్గానికి వెళ్లాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ప్రచారాన్ని మొదలుపెడుతున్నారని తెలుస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు