హోమ్ /వార్తలు /తెలంగాణ /

KCR | Telangana : రాష్ట్రంలో దుష్టశక్తులు చొరబడ్డాయి .. ప్రజల్ని విభజించే విచ్చిన్నకర శక్తులతో జాగ్రత్త : కేసీఆర్

KCR | Telangana : రాష్ట్రంలో దుష్టశక్తులు చొరబడ్డాయి .. ప్రజల్ని విభజించే విచ్చిన్నకర శక్తులతో జాగ్రత్త : కేసీఆర్

CM KCR(FILE)

CM KCR(FILE)

KCR SPEECH: ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలియజేశారు కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రంలో కొందరు మతతత్వంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ముఖ్యమంత్రి. ఇంకా ఏమన్నారంటే..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) పాల్గొన్నారు. హైదరాబాద్(Hyderabad) పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల (Telangana National Unity Vajrotsavam)శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని వినిపించారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలియజేశారు కేసీఆర్. ఇప్పుడు రాష్ట్రంలో కొందరు మతతత్వంతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ముఖ్యమంత్రి. మనుషుల మధ్య విభజన చేస్తూ... సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని అలాంటి విచ్ఛిన్నకర శక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూసే దుష్ట శక్తుల ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ బీజేపీ(BJP)ని ఉద్దేశించి అన్నారు.

PM Modi Birthday : మోదీకి తెలంగాణ సీఎం బర్త్‌ డే విషెస్ .. దేశానికి మరింత సేవ చేయాలని కాంక్షించిన కేసీఆర్

విచ్చినన్నకర శక్తులతో జాగ్రత్త..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ . నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం ఎందరో పోరాటాలతో తెలంగాణ రాచరికం నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తాను ప్రాణలకు తెగించి చావు అంచుల వరకు వెళ్లిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో రాచరిక పాలన కొనసాగిందన్నారు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగాల వల్ల తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పయనించిందన్నారు.

అలజడి సృష్టించడానికే ..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతూ పురోగతిని సాధిస్తున్నామన్నారు కేసీఆర్. రాష్ట్రం అన్నీ విధాలుగా అభివృద్ధి చెందడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని బీజేపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజంలో అలజడి సృష్టించడానికి కొన్ని దుష్ట శక్తులు మతతత్వం పేరుతో కుటిల రాజకీయాలు చేయానికి తయారయ్యాయని అన్నారు. ప్రజలందరూ ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

తిప్పి కొట్టకపోతే ప్రమాదమే..

మనుషుల మధ్య విభజన చేస్తూ... సమాజాన్ని చీల్చే ప్రయత్నాన్ని ఈ విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయని అన్నారు. ఈ దుష్ట శక్తుల ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని బీజేపీని ఉద్దేశించి అన్నారు. తెలంగాణను సాధించిన వ్యక్తిగా, మీ బిడ్డగా ఈ విషయాన్ని మీకు వివరించడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ఈ నేల ప్రశాంతంగా ఉండాలే కానీ... మళ్లీ బాధల్లోకి వెళ్లకూడదని అన్నారు. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా... కొన్ని దశాబ్దాల పాటు మనం అనుభవించిన ఆవేదనను మళ్లీ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Telangana News