హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: కాసేపట్లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ..నెక్స్ట్ ఏంటి?

Big News: కాసేపట్లో సీఎం కేసీఆర్ తో కవిత భేటీ..నెక్స్ట్ ఏంటి?

సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తో ఆమె బిడ్డ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) భేటీ కానున్నారు. ఈ మేరకు ఆమె కాసేపట్లో ప్రగతి భవన్ కు బయలుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ (Enforcement Dirctorate), సీబీఐ (Central Burew Of Investigation)  కేసులపై కేసీఆర్ (CM KCR) తో ఆమె చర్చించనున్నట్టు తెలుస్తుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తో ఆమె బిడ్డ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) భేటీ కానున్నారు. ఈ మేరకు ఆమె కాసేపట్లో ప్రగతి భవన్ కు బయలుదేరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ (Enforcement Dirctorate), సీబీఐ (Central Burew Of Investigation)  కేసులపై కేసీఆర్ (CM KCR) తో ఆమె చర్చించనున్నట్టు తెలుస్తుంది. కాగా మొన్న లిక్కర్ స్కాం కేసులో 36 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో ఎనిమిది మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఇక అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి నిన్న సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని అధికారులు CRPC 160 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది.

Breaking News: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు.. 6న విచారణ

CRPC 160 నోటీసులు అంటే ఏమిటి?

కాగా CRPC 160 నోటీసులు ఇచ్చారంటే ఆ కేసుకు సంబంధించి వారిని సాక్షులుగా పరిగణిస్తారు. కానీ నిందితులుగా పరిగణించడం కానీ అరెస్ట్ చేయడం కానీ కుదరదు. అయితే కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం హాజరు కావాల్సి వుంటుంది. ఆ విచారణలో వెల్లడయ్యే విషయాల ఆధారంగా తదుపరి చర్యలు వుండనున్నాయి.

డైరెక్షన్ ఇవ్వడానికి మీరెవరు..సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు ఆగ్రహం..క్షమాపణ చెప్పిన గంగాధర్

సీబీఐ నోటిసులపై స్పందించిన కవిత..ఆరోజే విచారణ

నిన్న ఇచ్చిన సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) స్పందించారు. తాను విచారణకు సిద్ధం అని అయితే హైదరాబాద్ లోని తన ఇంట్లోనే సిబిఐకి వివరణ ఇస్తా అని తెలిపారు. డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు అవుతానని ఆమె  (MLC Kavita) తెలిపారు. ఇక ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత (MLC Kavita) ఇంటికి చేరుకుంటున్నారు.

కేసీఆర్ తో కవిత ఏం చర్చించనున్నారు?

కాగా మరికాసేపట్లో కవిత  (MLC Kavita) ప్రగతి భవన్ కు వెళ్లి సీఎం కేసీఆర్ (CM KCR) తో భేటీ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలో కేసీఆర్ (CM KCR) తో కవిత  (MLC Kavita)  భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఏయే అంశాలు చర్చించనున్నారు. కేసీఆర్ (CM KCR) ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: CM KCR, Delhi liquor Scam, Kalvakuntla Kavitha, Telangana, Telangana News, Trs

ఉత్తమ కథలు