హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Laddu: బాలాపూర్​ లడ్డు రికార్డు బద్దలు.. వేలం పాటలో రూ.46 లక్షలు పలికిన ఆ ఏరియా వినాయకుడి లడ్డూ..

Ganesh Laddu: బాలాపూర్​ లడ్డు రికార్డు బద్దలు.. వేలం పాటలో రూ.46 లక్షలు పలికిన ఆ ఏరియా వినాయకుడి లడ్డూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో గణేశ్​ లడ్డూ వేలం పాటలు జరుగుతున్నాయి. తాజాగా ఆల్వాల్ లోని కనాజిగూడ మరకత గణేశ్ లడ్డూ వేలం.. బాలాపూర్​ లడ్డూ రికార్డును బ్రేక్​ చేసింది. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    హైదరాబాద్‌ (Hyderabad)లో ఏటా గణేశ్​ ఉత్సవాలు (Ganesh Chaturthi ) అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది చాలా వరకు విగ్రహాలకు శుక్రవారం నిమజ్జనోత్సవం జరిగింది. మిగిలిపోయిన గణపతులను శనివారం హుస్సేన్ సాగర్‌ (Hussain sagar)లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో గణేశ్​ లడ్డూ వేలం పాటలు జరుగుతున్నాయి. తాజాగా ఆల్వాల్ లోని కనాజిగూడ మరకత గణేశ్ లడ్డూ (Kanajiguda Marakata Ganesh Laddu) వేలం.. బాలాపూర్​ లడ్డూ రికార్డును బ్రేక్​ చేసింది.  శనివారం జరిగిన వేలం పాటలో ఇక్కడి లడ్డూ రూ.46 లక్షలు పలికింది. రూ. 45,99,999కి లడ్డూని వెంకట్ రావు అనే వ్యక్తి దక్కించుకున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలోనైనా లడ్డూ వేలం పాటలో ఇదే రికార్డు కావడం గమనార్హం.

    24.6 లక్షలకు బాలాపూర్​ లడ్డూ..

    బాలాపూర్‌ లడ్డూ (Balapur laddu) కూడా వేలంలో భారీ ధర పలికింది. బంగారు లడ్డూను వ్యాపారి వంగేటి లక్ష్మారెడ్డి(Vangeti Lakshmareddy) దక్కించుకున్నారు. పోటాపోటీగా సాగిన లడ్డూ వేలంలో 24 లక్షల 60వేల(24 lakhs 60 thousand)కు లడ్డూను దక్కించుకున్నారు. 29సారి జరిగిన వేలంలో లడ్డూ ప్రసాదాన్ని కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డికి అందజేసారు. ఈ వేలంలో లడ్డూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు లక్ష్మారెడ్డి. లడ్డూ వేలం అనంతరం భారీ గణనాథుడి శోభయాత్రను ప్రారంభించారు. లడ్డూ వేలంలో గతంలో పాల్గొన్న వారితో పాటు మరో 9మంది కొత్తగా ఈ వేలంలో చేరారు.

    ఇప్పటి వరకు 28ఏళ్లుగా బాలాపూర్‌ లడ్డూని వేలం వేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్ధిక పరిస్థితుల దృష్ట్య గతేడాది కాస్త తక్కువ ధర పలికినప్పటికి ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో వేలం జరింది. మొట్టమొదటి సారిగా 1994 నుంచి బాలాపూర్‌లో గణేష్‌ లడ్డూ వేలంపాట కొనసాగూ వస్తోంది. బాలాపూర్‌ లడ్డూ వేలంపాట మొదట రూ.450తో ప్రారంభమైంది.

    ట్రాఫిక్​ ఆంక్షలు సడలింపు..

    నిన్నటి నుంచి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జనం (Ganesh Immersion) కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. భక్తులు మండపాలు, ఇళ్ల వద్ద ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా నిమజ్జనమవుతున్నాయి. గత రెండ్రోజులుగా అమలు చేస్తున్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పూర్తిగా సడలించారు. దీంతో ఎన్టీఆర్ మార్గ్ రోడ్డులో వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. అన్ని మార్గాల్లో వాహనాలు అనుమతిస్తుండటంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. మెల్లగా హుస్సేన్ సాగర్ వద్ద మిగిలిన గణేశ్ విగ్రహాల నిమజ్జనం కూడా దాదాపు పూర్తికావొచ్చింది.

    ఇవాళ ఒక్కరోజే  హైదరాబాద్ లో  7,334 మెట్రిక్ టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. 40 జేసీబీలు, 330 వాహనాలతో చెత్త తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో 330 వాహనాలకు అదనంగా మరో 97 వాహనాలు, 27 అదనపు జేసీబీలను జీహెచ్ఎంసీ సిబ్బంది వినియోగించారు. నగరంలోని 74 బేబీ పాండ్స్లో 89వేల విగ్రహాలు నిమజ్జనం చేశారని అధికారులు వెల్లడించారు.

    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Ganesh Chaturthi​ 2022, Hyderabad

    ఉత్తమ కథలు