తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ (Trs), బీజేపీ (Bjp) మధ్య మినీ యుద్ధమే నడుస్తుంది. ప్రస్తుత వాతావరణం ఎన్నికలను తలపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర, YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల (Ys sharmila) ప్రజా ప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపట్టి ఇప్పటికి కొనసాగుతుంది. ఇక త్వరలో కాంగ్రెస్ కూడా పాదయాత్ర చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ (Cm Kcr వరుస బహిరంగ సభలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కూడా ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఆరోజే పాదయాత్ర ప్రారంభం..
తెలంగాణలో త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. ఈ పాదయాత్ర డిసెంబర్ 7 నుండి ప్రారంభం కానుందని తెలిపారు. పూర్తి షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, అలాగే పార్టీ నుండి అభ్యర్థులను నిలబెడతామని పాల్ తెలిపారు. ఇక తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, ఇప్పటికిప్పుడు నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.
షర్మిలపై విమర్శలు...
తాను వారం రోజులుగా అమెరికాలో ఉన్నాను. ఇప్పుడు తిరిగొచ్చే వరకు ఐటీ దాడులు, షర్మిల పాదయాత్రలో దాడి గురించి తెలిసిందన్నారు. ఈ సందర్బంగా షర్మిల పాదయాత్రపై పాల్ విమర్శలు గుప్పించారు. ఏపీలో కూడా రాజన్న రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం క్రూరమైన పాలన చేస్తున్నారని అన్నారు. ఇక షర్మిల కూడా జగన్ బాటలోనే నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. షర్మిల పాదయాత్రను కవర్ చేయొద్దని మీడియాను పాల్ కోరారు.
కేసీఆర్ ను వదలని పాల్..
ఇక కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. ఐటీ దాడుల్లో టీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో కోట్ల రూపాయలు బయటపడుతున్నాయన్నారు. ఇక మునుగోడులో గెలిపిస్తే 15 రోజుల్లో అభివృద్ధి పనులు చేస్తామని హామీనిచ్చారు. కానీ ఇప్పుడు మునుగోడును మరిచిపోయారన్నారు. నేను ప్రజల సమస్యలను తేల్చుకునేందుకు పాదయాత్ర చేపట్టబోతున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను పాల్ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Hyderabad, Ka paul, Telangana, YS Sharmila