హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News : బీర్‌ సీసా ముక్కతో వివాహిత గొంతు కోసిన ఎమ్మెల్యే పీఏ .. ఆ కోరిక తీర్చను అన్నందుకే ..

Crime News : బీర్‌ సీసా ముక్కతో వివాహిత గొంతు కోసిన ఎమ్మెల్యే పీఏ .. ఆ కోరిక తీర్చను అన్నందుకే ..

HYDERABAD MURDER ATTACK

HYDERABAD MURDER ATTACK

Hyderabad: వివాహితతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను భర్తను వదిలి తనతో ఉండమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ..బీర్‌ సీసాతో గొంతు కోశాడు. దాడి చేసిన వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ కావడంతో వార్త సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో అర్దరాత్రి దారుణం జరిగింది. వివాహిత మహిళపై ఆమె ఫేస్‌బుక్(Facebook) ఫ్రెండ్ బీర్‌ సీసాతో గొంతు కోసిన సంఘటన కలకలం రేపింది. ఈసంఘటన జూబ్లిహిల్స్(Jubilee Hills) పరిధిలో జరిగింది. బాధితురాలు నిషా (Nisha) అనే 35సంవత్సరాల మహిళకు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath)దగ్గర గతంలో పీఏగా పనిచేసిన విజయ్‌ సింహా(Vijay Simha)అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నిషాతో ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకొని విజయ్ ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి పలుమార్లు వీడియో కాల్స్ చేసుకోవడం వంటివి చేశారు. ఈక్రమంలోనే విజయ్ సింహా నిషాపై ఒత్తిడి చేస్తూ వచ్చాడు.

KTR|Viral news : ఇండిగో ఫ్లైట్‌లో తెలుగు ప్రయాణికురాలికి అవమానం .. మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా..?

ఫేస్‌బుక్‌ పరిచయంతో ..

తన కోరిక తీర్చమని ..పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో భర్తను వదిలేసి తనతో ఉండాలని పలుమార్లు ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. ఆక్రమంలోనే ఆమె నిరాకరించిందని ఆదివారం అర్దరాత్రి ఆమె ఇంటికి వెళ్లి బీరు సీసాను పగలగొట్టి ఆ గాజు పెంకుతో నిషా గొంతు కోశాడు. అటుపై ఆమె చేయిని విరగ్గొట్టాడు.

పెళ్లి చేసుకోమని టార్చర్..

ఎమ్మెల్యే పీఏ చేతిలో తీవ్ర గాయాలైన నిషాను భర్త ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. అయితే ఈఘటనపై నిషా భర్త పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Mystery: హాస్టల్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం .. నరబలి కోసం అంతకు తెగించారా..!

ఒప్పుకోనందుకే దాడి..

నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నిందితుడు విజయ్ సింహా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ..కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నిషా భర్త సైతం తనకు ప్రాణహాని ఉందని కేసు నిందితుడు తనను చంపుతాడేమోననే భయం ఉందంటూ మీడియాతో చెప్పుకున్నాడు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad crime, Married women

ఉత్తమ కథలు