హోమ్ /వార్తలు /telangana /

చిరంజీవికి రోడ్డు స్థలాన్ని అమ్మేశారు.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు

చిరంజీవికి రోడ్డు స్థలాన్ని అమ్మేశారు.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు

చిరంజీవికి రోడ్డు స్థలాన్ని అమ్మేశారు

చిరంజీవికి రోడ్డు స్థలాన్ని అమ్మేశారు

చిరంజీవికి రాసిచ్చిన ల్యాండ్ విలువ బహిరంగ మార్కెట్‌లో దీని విలువ గజానికి రూ. 4 లక్షలపైనే పలుకుతుండగా ప్రభుత్వ ధర ప్రకారం రూ. 64 వేల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేశారు.

  జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలు కలకల రేపుతున్నాయి. గజం మూడున్నర లక్షలకు పైగా పలుకుతున్న.. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ విలువకే అంటగట్టి బ్యాక్ డోర్ ద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ పాలకవర్గం తాజాగా మెగాస్టార్ చిరంజీవి రోడ్డు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నతీరు సొసైటీ సభ్యులను కలవరపెడుతోంది. ఇన్నాళ్లుగా అనుకున్నది సాధించకపోవడంతో.. ఇప్పుడున్న పాలక మండలి తమకు అనుకూలంగా..సమయం కలిసి రావడంతో 595గజాలని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

  సాక్షి కథనం ప్రకారం... సొసైటీ ప్రెసిడెంట్‌ బి. రవీంద్రనాథ్, (టీవీ–5 అధిపతి బీఆర్‌ నాయుడు) ట్రెజరర్‌ పి.నాగరాజులు సొసైటీ బైలాస్‌కు విరుద్ధంగా, కో–ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా విలువైన స్థలాన్ని ప్రముఖ హీరో కొణిదెల చిరంజీవికి విక్రయించారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 25లోని ప్లాదాన్ని ఆనుకొని వెనుక భాగంలో షేక్‌పేటలోని కొత్త సర్వే నంబర్‌ 120 (పాత సర్వే నంబర్‌ 403/1), హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్‌ 102/1లోని 595 గజాల అదనపు స్థలాన్ని (అడిషినల్‌ ల్యాండ్‌) అక్రమంగా చిరంజీవికి రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపై బుధవారం మున్సిపల్ శాఖ,హౌసింగ్ సొసైటీ అధికారులకి, పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

  చిరంజీవికి రాసిచ్చిన ల్యాండ్ విలువ బహిరంగ మార్కెట్‌లో దీని విలువ గజానికి రూ. 4 లక్షలపైనే పలుకుతుండగా ప్రభుత్వ ధర ప్రకారం రూ. 64 వేల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేశారు. అంటే రూ. 23.80 కోట్లు విలువజేసే స్థలాన్ని కేవలం రూ. రూ. 3.80 కోట్లకే అప్పగించి ప్రతిఫలంగా మిగిలిన సొమ్ములో పెద్ద మొత్తంలోనే దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్లు అక్రమంగా సుమారు 6 కోట్లు లబ్ధి పొందడంతో పాటు తమ తెరవెనుక పనులను చేయించుకునేందుకు చిరంజీవిని వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

  Plot No. ౩౦౩ N ప్లాట్ నం.లో 3,౩౩౩ చదరపు గజాల కలిగిన భూమిని 1999 వ సంవత్సరంలో కె.చిరంజీవి 120 “x 250 “కొలతలు గల భూమిని కొనుగోలు చేసారు. ఈ భూమికి దక్షిణ దిశగా ఉన్నఖాళీ ప్రదేశం 595 గజాలు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకి సంబంధించిన ప్రభుత్వ భూమి, జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లేఔట్ లో రోడ్డని ఉంది. అయితే చిరంజీవి ఆధీనంలో ఉంటే..జీ.ఓ. నెంబర్ 58,59 ప్రకారం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవాలి. కానీ చిరంజీవికి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో లేఔట్ ను పరిశీలించకుండా ఎంతో రహస్యంగా 595 చదరపు గజాల భూమిని 117”x 47” కొలతలతో ఈనెల 20న కుట్రతో డాక్యుమెంట్ నెంబర్ 2740 -2022 చేయించుకున్నారు.

  పాలక వర్గం అక్రమాలపై సొసైటీ సభ్యులు ప్రభాకర్‌రావు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌కు, విజిలెన్స్, కో–ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం షేక్‌పేట మండల సర్వేయర్‌ సాయికాంత్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వేయర్‌ రాజేశం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. ఇది ప్రభుత్వ స్థలమని, రోడ్డు ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ప్రభాకర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సొసైటీలోని కొందరు అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్‌ చేశారన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలిసే ఈ తతంగం జరిగిందని, సొసైటీ లేఔట్‌ను పరిశీలించకుండానే దీన్ని రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపించారు. ఈ ప్రక్రియలో కో–ఆపరేటివ్‌ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన దుయ్యబట్టారు. సొసైటీ జనరల్‌ బాడీ మీటింగ్‌లోనూ రిజిస్ట్రేషన్‌ సంగతి సభ్యులకు ప్రెసిడెంట్, ట్రెజరర్‌ తెలియజేయలేదని ఆరోపించారు.

  మరోవైపు ఫిర్యాదు దారులకు కొందరి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. ఎవరు చేస్తున్నారో వాళ్ల నంబర్లు కూడా కనిపించకుండా కాల్ చేస్తూ బెదిరిస్తున్నారన్నారు. వెంటనే ఫిర్యాదు ఉపసంహరించుకోకపోతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారని... సొసైటీ సభ్యుడు ప్రభాకర్ రావు చెబుతున్నారు. బెదిరింపు కాల్స్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chiranjeevi, Tollywood

  ఉత్తమ కథలు