మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త... అందుబాటులోకి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్

వేళల్లో మార్పులు చేయడంతో జూబ్లీహిల్స్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు హెచ్ఎంఆర్డీ అధికారులు.

news18-telugu
Updated: May 18, 2019, 9:57 AM IST
మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త... అందుబాటులోకి జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్
మెట్రోరైలు
news18-telugu
Updated: May 18, 2019, 9:57 AM IST
హైదారాబాద్ మెట్రో ప్రయాణికులకు HMRD మరో శుభవార్త అందించింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ నేటి నుంచి సేవలందించనున్నదని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్‌, తారకరామనగర్‌, దీన్‌దయాల్‌నగర్‌, గాయత్రీహిల్స్‌, కేబీఆర్‌పార్క్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాలకు రైలు సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో చెక్‌పోస్టు చుట్టుపక్కల కాలనీల వాసులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం 50 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని మెట్రో అధికారులు తెలిపారు. జూబ్లీహీల్స్ స్టేషన్ సిద్ధమై చాలా రోజులే అయినప్పటికీ రైలు వేళల్ని సర్దుబాటు చేయడం కోసం ఇప్పటి వరకు అధికారులు ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. మార్చి 20న అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గం అందుబాటులోకి వచ్చింది. అయితే, సైబర్ టవర్స్ వద్ద రైలు ట్రాక్ మారే సదుపాయం లేకపోవడంతో చెక్‌పోస్టు వరకు వెళ్లిన మార్గంలోనే రైళ్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వేళలు సర్దుబాటు కావడం ఇబ్బందిగా మారడంతో ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇప్పుడు అందుకు అనుగుణంగా వేళల్లో మార్పులు చేయడంతో ఈ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు హెచ్ఎంఆర్డీ అధికారులు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేషన్‌కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. సాధారంగా మెట్రో స్టేషన్లలో ఓ అంతస్తులో టికెట్ కౌంటర్లు ఉండగా, మరో అంతస్తులో ప్లాట్‌ఫాం ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ రెండూ ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశారు అధికరాులు. చెక్‌పోస్టు స్టేషన్‌తో కలుపుకుంటే ప్రస్తుతం 50 మెట్రో స్టేషన్లు భాగ్యనగరంలో వినియోగంలోకి వచ్చినట్టు అయింది.ఈ స్టేషన్ అందుబాటులోకి రావడంతో చాలామంది ఉద్యోగులకు ప్రయాణి మరింత సులభం కానుంది. ఎందుకంటే కృష్ణా నగర్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో... నిత్యం ఇక్కడ ఆఫీసులకు వెళ్లే వాళ్లకు ఆలస్యం అయ్యేది. దీంతో ఇప్పుడు ఈ సమస్య కాస్త తగ్గినట్లైంది.


First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...