HYDERABAD JEWELERY AND CASH STOLEN FROM POLICE HOUSE IN MIRPET HYDERABAD SNR
Hyderabad: పోలీస్ ఇల్లు గుల్ల..ఏఎస్ఐ ఇంట్లోంచి దొంగలు ఏం ఎత్తుకెళ్లారో తెలుసా
(ప్రతీకాత్మకచిత్రం)
Hyderabad: నగరంలో దొంగలు పడ్డారు. ఓ పోలీస్ అధికారి ఇంట్లో పట్టపగలు చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 35లక్షల రూపాయల నగదు, నగలు ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్(Hyderabad)ప్రతి గల్లీలో ఇంటింటికి సీసీ కెమెరాలు,కార్పొరేట్ డివిజన్కో పోలీస్ స్టేషన్, అడుగడుగున పోలీస్ పెట్రోలింగ్...ఇంత బందోబస్తు ఉన్నప్పటికి నగరంలో దొంగలు పడుతూనే ఉన్నారు. వ్యాపారులు, రియల్టర్ ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఈసారి రూట్ మార్చారు. ఏకంగా ఓ పోలీస్ ఇంట్లో చోరికి పాల్పడ్డారు. మీర్పేట్(Meerpet) విజయపురి కాలనీ(Vijayapuri Colony)లో నివాసముంటున్న ఏఎస్ఐ ముదావత్ శంకర్( Mudavath Shankar) ఇంట్లో చోరీ జరిగింది. గురువారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకున్న దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 35తులాల బంగారు నగల(Gold jewelry)తో పాటు 17లక్షల క్యాష్(Cash)ఎత్తుకెళ్లారు. యజమాని శంకర్ సిటీలోని ఓ పోలీస్ స్టేషన్(Police Station)లో ఏఎస్ఐ(ASI)గా విధులు నిర్వహిస్తున్నాడు. మే నెలలో ఏఎస్ఐ శంకర్, లక్ష్మీ(Laxmi) దంపతుల కుమార్తె వివాహం ఉండటంతో పెళ్లికి అవసరమైన నగలు, పెళ్లి ఖర్చులకు అసరమయ్యే డబ్బులు ఇంట్లో దాచి పెట్టారు. పెళ్లి పనుల నిమిత్తం సొంత ఊరు రంగారెడ్డి(Rangareddy)జిల్లా ఆమన్గల్(Amangal)లోని కలకొండ(Kalakonda)కు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం పని ముగించుకొని విజయపురి కాలనీలోని ఇంటికి చేరుకోవడంతోనే షాక్ అయ్యారు. ఇంటి తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉండటం, బీరువాలోని డబ్బులు, నగలు మాయమవడం, దుస్తులు, వస్తువులు చెల్లా చెదురుగా పడివుండటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏఎస్ఐ దంపతులు.
పోలీస్ ఇంట్లోనే చోరీ..
నిత్యం దొంగల్ని పట్టుకోవడం, చోరీ కేసులు చేధించే పోలీసు ఇంట్లోనే దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపింది. వాస్తవంగా ఇంట్లో ఎవరో ఒక్కరు ఉన్నా చోరీ జరిగి ఉండేది కాదని స్థానికులు తెలిపారు. భార్యభర్తలు సొంత ఊరికి వెళ్లడం, కుమార్తె గ్రూప్ ఎగ్జామ్స్ కోసం శిక్షణ తీసుకునేందుకు నగరానికి వెళ్లింది. శంకర్ కొడుకు ఇంటికి తాళం వేసి కాలేజీకి వెళ్లిన సమయాన్ని దొంగలు పసిగట్టారు. ఎవరూ లేరు కదా అని పట్టపగలే ఇంట్లోకి చొరబడి మొత్తం 35లక్షల విలువ చేసే నగలు, నగదుతో ఉడాయించారు.
35లక్షలు మాయం..
ఏఎస్ఐ శంకర్ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. దాదాపు 35లక్షల సొత్తు పోయింది. కాని బాధితులు రాత్రి 10గంటల సమయంలో మీర్పేట్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఏఎస్ఐ శంకర్ భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు మీర్పేట్ సీఐ మహేందర్రెడ్డి. ఇంటి చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ పరిశీలిస్తామన్నారు. చోరీ పక్కా ప్లాన్ ప్రకారమే జరగడంతో ..తెలిసిన వాళ్లు ఏమైనా దొంగతనానికి ప్లాన్ వేశారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.