Mission Paani: ప్రతిష్టాత్మక IWA అవార్డుకు జలమండలి ఎండీ నామినేట్

సుమారు 130కి పైగా దేశాల నామినేషన్లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్‌కు జలమండలి ఎండీ ఎంపికయ్యారు. జలమండలి ఎండీని అభినందించిన ఐడబ్ల్యూఏ సెక్రటెరియట్, అలాగే తుది ప్రజంటేషన్‌ను సమర్పించాలని కోరింది.

news18-telugu
Updated: August 29, 2019, 8:03 PM IST
Mission Paani: ప్రతిష్టాత్మక IWA అవార్డుకు జలమండలి ఎండీ నామినేట్
దానకిషోర్ ఫైల్
  • Share this:
ప్రతిష్టాత్మక ఇంటర్‌నేషనల్ వాటర్ అసోషియేషన్ (IWA) అవార్డుకు హైదరాబాద్ జలమండలి ఎండీ దాన కిషోర్‌ నామినేట్ అయ్యారు. ఐడబ్యూఏ డెవలప్‌మెంట్ అవార్డుకు భారతదేశం నుంచి దాన కిషోర్‌ని ఎంపిక చేసింది. జల నాయకత్వం, జల సంరక్షణ (WaLC) కార్యక్రమం ద్వారా నీటి వృథాను తగ్గించడం, పునర్వినియోగం, బోర్లు రీఛార్జ్ చేయడంపై దృష్టి సారించిన ఒక ప్రత్యేకమైన చొరవ మరియు నీటి సంరక్షణ అంశంపై ప్రజలలో అవగాహన కల్పిస్తున్న విషయాలను ఈ అవార్డు నామినేషన్స్‌కు పంపించారు.

సుమారు 130కి పైగా దేశాల నామినేషన్లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్‌కు జలమండలి ఎండీ ఎంపికయ్యారు. జలమండలి ఎండీని అభినందించిన ఐడబ్ల్యూఏ సెక్రటెరియట్, అలాగే తుది ప్రజంటేషన్‌ను సమర్పించాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యుఎ డెవలప్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం వాటర్ డెవలప్ మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్ శ్రీలంకలోని కొలంబోలో 2019 డిసెంబర్ 1-5 నుండి సస్టైనబుల్ సొల్యూషన్స్‌పై జరుగుతుంది.
Published by: Shiva Kumar Addula
First published: August 29, 2019, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading