హోమ్ /వార్తలు /తెలంగాణ /

మద్యం తాగి బండి నడుపుతున్నారా ? అయితే జాగ్రత్త..!

మద్యం తాగి బండి నడుపుతున్నారా ? అయితే జాగ్రత్త..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ నగరంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మందు బాబులు మారడం లేదు. గత ఏడాది మందుతాగి వాహనాలు నడిపే వారికి రూ.600 కోట్ల జరిమానా విధించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు, హైదరాబాద్. 

హైదరాబాద్ మహానగరంలో తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ఒక్క జనవరిలోనే పోలీసులు 4236 మందిపై కేసులు నమోదు చేశారు. 365 మందికి జైలు శిక్ష విధించారు. 365 మంది నిందితులకు ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష పడింది.

జనవరిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 4236 మందిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 365 మంది ఉల్లంఘించిన వారికి ఇప్పటికే జైలు శిక్ష పడింది. నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘించే వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జనవరిలో 4236 మంది మద్యం మత్తులో వాహనాలు నడిపినట్లు పోలీసులు తెలిపారు. వారిపై కోర్టులో చార్జిషీట్లు సమర్పించారు. దాదాపు 365 మంది నిందితులకు ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష పడింది.

తాగి నడిపితే కఠిన శిక్షలు తప్పవు: 

మందు తాగి వాహనాలు నడిపిన వారిలో 3315 మంది పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మిగిలిన 556 మందిపై చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత, వారిని కూడా కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు , పాస్‌పోర్ట్‌లు, వీసా క్లియరెన్స్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు హెచ్చరించారు.

రూల్స్ అతిక్రమిస్తే కౌన్సిలింగ్ తప్పదు:

అక్రమాలకు పాల్పడిన వారికి టీటీఐ, గోషామహల్, బేగంపేట కేంద్రాల్లో కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత కోసం డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఇతర ఉల్లంఘనలకు వ్యతిరేకంగా డ్రైవ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరుతున్నారు.

ఏటా పెరిగిపోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు:

తాగి వాహనాలు నడిపే కేసులు ఏటి కేడాది పెరిగిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మందు బాబులు మారడం లేదు. గత ఏడాది మందుతాగి వాహనాలు నడిపే వారికి రూ.600 కోట్ల జరిమానా విధించారు. అయినా మందుబాబులు మారడం లేదు. అందుకే రెండు సార్లు తాగి వాహనాలు నడిపుతూ పోలీసులకు దొరికిపోతే, జైలు శిక్షతోపాటు, డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు. అప్పటికీ మారకపోతే పాస్ పోర్టులు కూడా రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాగి వాహనాలు నడపడం ద్వారా ఏటా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది హైదరాబాద్ నగరంలో తాగి వాహనాలు నడపడం ద్వారా 346 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పోలీసులు గుర్తించారు. ప్రమాదాలు నివారించేందుకు పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

First published:

Tags: Hyderabad, Local News

ఉత్తమ కథలు