టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) మధ్య వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకే పార్టీలో ఉంటూనే బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. కానీ వీళ్లిద్దరు ఒకే చోట తారసపడ్డట్టు మాత్రం ఆసక్తికర సంబాషణ మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల గాంధిభవన్ లో వీరిద్దరూ ఎదురెదురుగా కలుసుకోగా రేవంత్ (Revanth Reddy) జగ్గారెడ్డి మీసాన్ని మెలేశారు. అప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక తాజాగా నేడు సీఎల్పీలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ క్రమంలో జగ్గారెడ్డి (MLA Jaggareddy), రేవంత్ (Revanth Reddy) ఒకే సమయంలో సీఎల్పీకి వచ్చారు. అదే సమయంలో అక్కడ మీడియా వాళ్లు వున్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి (MLA Jaggareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది ఒకే ఇంట్లో ఉన్న తోటికోడళ్ల పంచాయితీ అని ఉదయం గొడవపడి సాయంత్రానికి మాట్లాడుకుంటామని అన్నారు.
ముందొకటి వెనకొకటి మాట్లాడను..
తాను ముందు ఒకటి వెనక మరొకటి మాట్లాడనని జగ్గారెడ్డి (MLA Jaggareddy) స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో కలిసి పని చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. ఆయన పాదయాత్రకు మద్దతు ఇస్తా. వచ్చే ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ (Revanth Reddy) నే కొనసాగించాలని..ఆయన టర్మ్ అయిపోయాకే తనకు ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ ను కోరారు. వచ్చే ఎన్నికల వరకు తాను రేవంత్ గురించి మాట్లాడబోనని చెప్పుకొచ్చారు. మేము అనుకుంటామని తరువాత కలుసుకుందామని జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు. అయితే తాము ఎందుకు కలుసుకున్నామో అని మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్నారని అన్నారు.
Breaking News: పాదయాత్ర కొనసాగింపుపై Ys షర్మిల కీలక నిర్ణయం..ఆ రోజే నుంచే ప్రారంభం
పెద్ద కోడలు ఎవరని ప్రశ్నించిన మీడియా..రేవంత్ రెడ్డి సమాధానం ఇదే..
తాము తోటి కోడళ్ల లాగ అనుకుంటాం మళ్లీ కలిసిపోతాం అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అయితే మీలో ఎవరు పెద్ద కోడలు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..మనం ఇప్పుడే కలిశాం అప్పుడే మళ్లీ గ్యాప్ పెంచేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) నవ్వుతూ వ్యాఖ్యానించారు. మీరు చెప్పినదానికే తాము అడుగుతున్నామని మీడియా ప్రతినిధి అనడంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి జగ్గారెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Mp revanthreddy, Revanth Reddy, Telangana, Telangana News