Home /News /telangana /

HYDERABAD IT EMPLOYEES LOOKING TOWARDS FARMHOUSE TO ENJOY WEEKENDS VRY BK

Hyderabad : హైద‌రాబాద్ లో కొత్త వీకెండ్ గేట్ వే లు.... ఫామ్ హౌస్ స్టే ల‌కు మొగ్గు చూపుతున్న ఐటీ ఉద్యోగులు!

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

Hyderabad : ఇప్పుడు హైద‌రాబాద్ సిటీలో కొత్త క‌ల్చ‌ర్ పుట్టుకొచ్చింది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం త‌రువాత  అంద‌రు దాదాపు ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. దీంతో వీకెండ్‌లో నగరానికి దగ్గరగా ఉండే.. ఫామ్ హౌస్ ల బాట ప‌డుతున్నారు.

    ఇప్పుడు హైద‌రాబాద్ సిటీలో కొత్త క‌ల్చ‌ర్ పుట్టుకొచ్చింది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం త‌రువాత  అంద‌రు దాదాపు ఇంటే ప‌రిమిత‌మ‌వుతున్నారు. తాజా కోవిడ్ ప‌రిస్థితిల్లో ఎక్క‌డికైన ట్రిప్ వెళ్లే అవ‌కాశాలు కూడా చాలా త‌క్కువే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో ఉన్న చాలా మంది సిటీకి ద‌గ్గ‌ర‌లో ఉన్న ఫామ్ హౌస్ ల బాట ప‌డుతున్నారు. ఒక రోజులో వెళ్లి వ‌చ్చేయోచ్చు, దాంతో పాటు ఫామ్ హౌస్ లో కాస్త  ప్ర‌కృతికి ద‌గ్గ‌రగా కూడా ఉన్నామ‌నే అనుభూతి పోందొచ్చు అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం సిటీలో ఈ వీకెండ్ ఫామ్ హౌస్ స్టే అనేది పాపులర్ టూరిస్ట్ అంశంగా మారింది. హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర‌ల్లో వీకెండ్  లో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయ‌డాని అందుబాట‌లో ఉన్న ఫామ్ స్టేల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    యాక్టివ్ ఫార్మ్ స్కూల్:  ఈ ఫామ్ హౌస్ సిటీకి దాదాపు 65 కిలోమీట‌ల‌ర్ల దూరంలో ఉంది. దాదాపు 7 ఎకారాల్లో ఉండే ఈ ఫామ్ హౌస్ మీ కుటుంబ స‌భ్యులు లేదా ఫ్రెండ్స్ తో వ‌చ్చి ఇక్క‌డ స్టే చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా, అన్ని COVID-19 ప్రోటోకాల్‌లతో పాటు ముందస్తు బుకింగ్‌తో ఈ ఫామ్ హౌస్ రోజుకు ఒక ఫ్యామిలీని మాత్ర‌మే ఈ వ్య‌వ‌సాయ క్షేత్రంలో గ‌డ‌ప‌డానికి అవ‌కాశం క‌ల్పిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఫామ్ హౌస్ లో మీరు వ్య‌వ‌సాయానికి సంబంధించి ప‌లు కోర్సులు కూడా చేయోచ్చు కోర్సులు పూర్త‌యిన వెంట‌నే స‌ర్టీఫీకేట్స్ కూడా అందిస్తోన్నారు. యాక్టివ్ ఫార్మ్ స్కూల్ హైదరాబాద్ నుండి  శంకర్‌పల్లి మీదుగా సులభంగా చేరుకోవచ్చు. ఇక్క‌డ మీరు గ‌డ‌పాల‌నుకుంటే  6300662113 ద్వారా వంశీని సంప్రదించవచ్చు.

    Telangana : అవును మేమే చంపాము.. జగిత్యాల జంట హత్య కేసులో ట్విస్ట్..

    వెన్నెల ఫామ్స్: హైదరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్స్‌కు సమీపంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రం ఇక్కడ ఆచరించే సేంద్రీయ వ్యవసాయం గురించి పూర్తి స‌మాచారం అంధిస్తోంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఏ స‌మ‌యంలోనైన వ‌చ్చి ఇక్క‌డ జ‌రుగుతున్న వ్య‌వ‌సాయ కార్య‌కాలాపాల‌ను తెలుసుకోవ‌చ్చు దీంతోపాటు పొలంలో పండించిన వివిధ రకాల కూర‌గాయాలు కొనుకునే అవ‌కాశం క‌ల్పిస్తోంది ఈ ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ మీరు బుక్ చేసుకోవాల‌నుకుంటే వెన్నెల ఫామ్స్ 7337069554లో సంప్రదించవచ్చు.

    లక్ష్యాస్ నేచురల్ ఫుడ్స్:  హైదరాబాద్ నుండి 80 కి.మీ దూరంలో ఉన్న, 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మీరు మీ ఫ్యామిలీతో వెళ్లి గ‌డ‌పోచ్చు. ఇక్క‌డ‌ రుచికరమైన ఆర్గానిక్ అల్పాహారం, భోజనం, స్నాక్స్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు నిర్వ‌హుకులు, ప్రస్తుత COVID-19 నిబంధ‌న‌లు అమలులో ఉన్నందున, వీళ్లు లిమిటెడ్ బుకింగ్స్ మాత్ర‌మే అనుమ‌తిస్తోన్నార‌. 9502731861లో లక్ష్యాస్‌తో సంప్రదించండి.

    Khammam : సీఎం జగన్‌ను కలిసిన పొంగులేటి.. ఏమిటి మర్మం..? ఎందుకీ పరిస్థితి..?

    హైడ్‌అవుట్:  హైదరాబాద్ కు 80 కి.మీ  ఉన్న ఈ  2.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్‌హౌస్, కుటుంబం లేదా స్నేహితులతో ఎంజాయ్ చేయ‌డానికి సరైన వీక్ ఎండ్ గేట్ వే అని చెప్పొచ్చు. ఇక్క‌డ మీరు ట్రెక్కింగ్ చేయడానికి అనంతగిరి కొండలు కేవలం 2 కి.మీ దూరంలో ఉన్నాయి. మీరు ఇక్క‌డ స్టే చేయాల‌నుకుంటే 9000737394లో హైడ్‌అవుట్ ప్రతినిధులను సంప్రదించండి. సో చ‌దివారు క‌దా ఈ వీకెండ్ గేట్ వేలు... మీ ఫ్యామిలితో లేదా ఫ్రెండ్స్ తో ఈ వీకెండ్ కి ప్లాన్ చేయండి మ‌రి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Farm house, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు