హోమ్ /వార్తలు /తెలంగాణ /

Khammam : ఆ.. జిల్లా టీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు... రక్తం చిందుతున్నా.. అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ...

Khammam : ఆ.. జిల్లా టీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు... రక్తం చిందుతున్నా.. అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ...

Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరోసారి టీఆర్ఎస్ వర్గాల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి.. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని, రక్తం చిందించారు. పినపాక నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం అవిష్కరణ మరోసారి విభేదాలకు వేదికైంది.

  ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజవర్గంలోని టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.. పోటాపోటి నినాదాలతో ఆ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్యుకున్నారు. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సంధర్భంగా చెలరేగిన వివాదం పోలీసులు ఉండగానే రక్తం చిందేలా కొట్టుకున్నారు. అయితే ఈ విగ్రహా అవిష్కరణకు వెళ్లిన టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి ఆందోళనల మధ్యనే పోలీసులను బలవంతంగా పక్కకు నెట్టి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా ఈ వివాదం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి,ఎమ్మెల్యే రేగ కాంతారావు అనుచరుల మధ్య చోటుచేసుకుంది.

  వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజవర్గంలోని అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో పోంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు విరాళాలు సేకరించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ విగ్రహావిష్కరణకు మాజీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితోపాటు ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని అహ్వానించారు. అయితే ఆ విగ్రహాం అవిష్కరణను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు వర్గీయులు ప్రయత్నించారు. దీంతో స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే రేగా వర్గీయలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకున్నారు. ఈ సంధర్భంలో విగ్రహావిష్కరణను బలవంతంగా చేసేందుకు పిడమర్తి రవి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో ఒకరికి తలకు గాయాలు కావడంతో పాటు రక్తం చిందింది.

  Khammam : కొడుకు చనిపోతే.., నేను లేనా... కోడలిపై మామ అరాచకం.. పెళ్లంటూ దాడి..!

  అయితే ఘర్షణలను ముందే ఊహించిన పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినా ఘర్షణ మాత్రం ఆగలేదు.. కాగా ఈ ఘర్షణ వాతవరణంలోనే మాజీ ఎంపీ పొంగులేటి లేకుండానే పిడమర్తి రవి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలీసులు అడ్డుకున్నా వారిని పక్కకు నెట్టివేసి విగ్రహాం ముసుగు తీసి దండవేశారు. దీంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. అయితే ఈ ఎపిసోడ్‌లో ఒకరిపై ఒకరి తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. రేగా వర్గీయులు కావాలనే ఈ దాడికి పాల్పడ్డరని ఆరోపణలు చేశారు.

  First published:

  Tags: Khammam, TRS leaders

  ఉత్తమ కథలు