Home /News /telangana /

HYDERABAD INTER STUDENT ATTEMPTED SUICIDE IN HYDERABAD NARAYANA COLLEGE DUE TO THE PAIN OF NOT GIVING TC SNR

Hyderabad : ప్రిన్సిపాల్ గదిలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం .. కారణం తెలిస్తే షాక్ అవుతారు

suicide attempt(FILE PHOTO)

suicide attempt(FILE PHOTO)

Suicide attempt: హైదరాబాద్‌లో ఘోరం జరిగింది. రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ స్టూడెంట్ నారాయణస్వామి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈఘటనలో విద్యార్ధితో పాటు ప్రిన్సిపాల్, మరో ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
హైదరాబాద్‌(Hyderabad)లో ఘోరం జరిగింది. రామంతాపూర్‌(Ramantapur)లోని నారాయణ కాలేజీ(Narayana College)లో ఇంటర్ మీడియట్ స్టూడెంట్ నారాయణస్వామి(Narayana Swamy)ఆత్మహత్యాయత్నం చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. టీసీ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లిన విద్యార్ధి ప్రిన్సిపాల్‌ గది(Principal room)లోకి వెళ్లి సుధాకర్‌రెడ్డి(Sudhakar Reddy)ని టీసీ ఇవ్వమని కోరాడు. అయితే గత కొద్ది రోజులుగా నారాయణస్వామి అనే స్టూడెంట్ టీసీ(TC)కోసం కాలేజీకి వెళ్తుంటే టీసీ ఇవ్వకుండా తిప్పుతున్నారు. ఆ మనస్తాపంతోనే ప్రిన్సిపల్‌ గదిలో పెట్రోల్‌Petrol పోసుకొని నిప్పంటించుకున్నాడు స్టూడెంట్(Student) నారాయణస్వామి.

Crime news: ఆ ఒక్క మాటకే నానమ్మను చంపాడు .. ఎలాంటి శిక్షపడిందో తెలిస్తే షాక్ అవుతారు

కాలేజీలో ఆత్మహత్యాయత్నం..
అంతే కాదు పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్న వెంటనే మంటలు ఎగసిపడటంతో శరీరం కాలిపోతుండగానే వెంటనే వెళ్లి ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డిని పట్టుకున్నాడు. ఈప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గట్టిగా కేకలు వేయడంతో కాలేజీలో ఉన్న ఏవో అశోక్‌రెడ్డి ప్రిన్సిపాల్‌ని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈఘటనలో అతని శరీరం కూడా తీవ్రంగా కాలిపోయింది. స్టూడెంట్, ఇద్దరు ఉద్యోగులు మంటల్లో కాలిపోవడంతో వెంటనే కాలేజీలో పని చేస్తున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటల్ని ఆర్పారు.


మంటల్లో ముగ్గురికి గాయాలు..
కాలేజీ యాజమాన్యం తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డితో పాటు ఏవో అశోక్‌రెడ్డి, స్టూడెంట్‌ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో రామంతాపూర్‌ నారాయణ కాలేజీలో ఉద్రిత్త వాతావరణం నెలకొంది. అయితే విద్యార్ది అంతటి దారుణమైన నిర్ణయానికి ఎందుకు పాల్పడ్డారు..ప్రిన్సిపాల్‌, స్టూడెంట్ మధ్య ఏమైనా సంభాష జరిగిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Suicide attempt, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు