Home /News /telangana /

HYDERABAD INJURED CRIMINAL ESCAPED FROM THE HYDERABAD SR NAGAR POLICE STATION SNR

Telangana|Hyd: 30కేసుల్లో నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో ఆ తప్పు చేయడంతో 31వ కేసు నమోదు

(ప్రతీకాాత్మకచిత్రం)

(ప్రతీకాాత్మకచిత్రం)

Telangana|HYD:ఓ పాతనేరస్తుడు తన బుద్ధి బయటపెట్టకున్నాడు. 30కేసుల్లో నిందితుడిగా గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొస్తే అక్కడ కూడా ఆ తప్పు చేయడంతో మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

ఒకటి రెండు కాదు..ముప్పై నేరాల్లో నిందితుడు. అమ్మాయిల్ని మోసం చేసిన రికార్డు ఉంది. నేరాల చిట్టా పెద్దగా ఉండటంతో నిందితుడ్ని పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కి తీసుకొస్తే అక్కడా మరో తప్పు చేసి ఆసుపత్రి పాలయ్యాడు. ఓ పాతనేరస్తుడు ఇంత అతికతెలివి ప్రదర్శించి మరో కేసులో ఇరుక్కోవడం చూసి పోలీసులు జాలిపడుతున్నారు. ఈసంఘటన హైదరాబాద్‌(Hyderabad)లోని ఎస్‌ఆర్‌ పోలీస్‌ స్టేషన్‌(SR Police Station)లో జరగడంతో వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ స్టోరీ ఏమిటంటే..కృష్ణ(Krishna)అనే వ్యక్తి ఓ పాతనేరస్తుడు. సుమారు 30కేసుల్లో నిందితుడి(Accused)గా ఉన్నాడు. నేరాల కేసుల్లో అమ్మాయిల్ని సైతం మోసం చేసినట్లు తేలడంతో పోలీసులు అతడ్నిరెండ్రోజుల క్రితం అమీర్‌పేట(Ameerpeta)లో అదుపులోకి తీసుకున్నారు.

30నేరాల నుంచి తప్పించుకోవాలని..
కృష్ణ అనే పాతనేరస్తుడ్ని అదుపులోకి తీసుకున్న ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు అతడ్ని విచారించేందుకు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. రెండ్రోజులుగా స్టేషన్‌లో ఉంచారు. మధ్యాహ్నం సమయంలో పోలీస్ స్టేషన్‌ రెండో అంతస్తులో పీఎస్‌ వెనుక వైపు నుంచి కిందకు దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్టేషన్‌లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలని చూసిన నేరస్తుడు కృష్ణ సెకండ్‌ ఫ్లోర్ నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తల, కాళ్లకు దెబ్బలు తగలడంతో వెంటనే స్టేషన్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.

31వ నేరం..
ఆల్రెడీ 30కేసుల్లో నిందితుడిగా ఉన్న పాతనేరస్తుడు విచారణలో ఎక్కడ నిజాలు చెప్పాల్సి వస్తుందోనని జాగ్రత్త పడాలనుకున్నాడు. పోలీసుల ఇంటరాగేషన్‌కి భయపడ్డాడు. ఏది ఏమైతేనేం పోలీసుల అదుపులో స్టేషన్‌ ఖైదీగా ఉండి పారిపోవాలని ట్రై చేశాడు. ఈప్రయత్నంలో గాయలవడమే కాకుండా మరో కేసు నమోదైంది. కృష్ణ అనే పాతనేరస్తుడు పోలీస్ స్టేషన్‌ నుంచే పరార్ అవ్వాలని ట్రై చేశాడంటే ఇంకా మనోడి ఖాతాలో ఎన్ని నేరాలు ఉన్నాయోనని పోలీసులు డౌట్ పడుతున్నారు. స్టేషన్ సెకెండ్‌ ఫ్లోర్ నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించడంతో గాయపడిన విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ గణేష్ ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌కు చేరుకున్నారు. నేరస్తుడిపై ఉన్న కేసులు, వివరాలు తెలుసుకున్నారు. విచారణ జరిపిస్తామని తెలిపారు.

ఇప్పుడు బయటపడే ఛాన్సే లేదుగా..
నేరస్తుల్ని పట్టుకోవడంలో పోలీసులు కాస్త ఆలస్యం చేస్తారేమో కాని పట్టుకున్న వాడ్ని పారిపోతే మాత్రం వదలరు. ఎట్లాగైనా పట్టుకొని వాడిపైన మరికొన్ని కేసులు నమోదు చేస్తారు. ఈ చిన్న విషయం తెలియని నిందితుడు కృష్ణ పోలీస్‌ స్టేషన్‌లో రెండో అంతస్తు పైనుంచి దూకి ప్రాణాలతో రిస్క్ చేశాడు. గాయపడినప్పటికి పోలీసులు మాత్రం తమ డ్యూటీ చేయాల్సిందే కదా.
Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు