హైదరాబాద్ ఇన్ఫోసిస్‌ పార్కింగ్ దందా... ఉద్యోగస్తుల నుంచి ఫీజు వసూలు

ప్ర‌తి నేల ఉద్యోగుల జీతం నుంచి టూ వీల‌ర్ అయితే 250 రూపాయిలు ఫోర్ వీల‌ర్ అయితే 500 రూపాయిలు పార్కింగ్ ఫీజ్ పేరుతో క‌ట్ చేస్తోంది. అయితే కంపెనీ తీసుకున్న ఈ విచిత్ర నిర్ణ‌యంతో ఉద్యోగులు ఒక్క‌సారిగా షాక్ కు గురయ్యారు.

news18india
Updated: May 9, 2019, 12:38 PM IST
హైదరాబాద్ ఇన్ఫోసిస్‌ పార్కింగ్ దందా... ఉద్యోగస్తుల నుంచి ఫీజు వసూలు
ఇన్ఫోసిస్
  • Share this:
ఇన్ఫోసిస్ ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ. ఇందులో జాబ్ వచ్చిందంటే చాలు ఎవరైనా ఎగిరి గంతేస్తారు. వాళ్లంత అదృష్ట‌వంతులు ఉండరని అనుకుంటారు. కానీ పీత క‌ష్టాలు పీత‌వి సీత క‌ష్టాలు సీత‌వి అన్న‌ట్లుగా ఇందులో ఉద్యోగుల‌కు కూడా వాళ్ల‌కు ఉండే కష్టాలు వాళ్ల‌కు ఉంటాయి. ప్ర‌తి నెల టార్గెట్లు టీమ్ లీడ‌ర్ల ఒత్తిడ్లి, ఇప్పుడు వీటికి తోడు ఇందులో ప‌ని చేస్తోన్న ఉద్యోగ‌స్తుల‌కు మ‌రో త‌ల‌నొప్పి కూడా స్టార్ట్ అయింది. సాధార‌ణంగా మ‌నం ఆఫీస్‌కు వెళ్తే... మ‌న బండి పార్కింగ్ చేయ‌డానికి ప్ర‌త్యేకంగా పార్కింగ్ స్లాట్లు ఉంటాయి. అక్కడ మన బండిని పార్క్ చేసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా మనం ఎలాంటి డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న కంపెనీకి సంబంధించిన పార్కింగ్ లో మ‌న వాహ‌నం పార్క్ చేస్తే స‌రిపోతుంది. ఇది అంద‌రికి తెలిసిందే. అయితే ఎంతో పేరున్న ఈ బ‌డా సంస్థ ఒక నయా విధానానికి తెర లేపింది. త‌మ వ‌ద్ద ప‌నిచేస్తోన్నఉద్యోగుల వాహానాల‌కు పార్కింగ్ ఫీజులు వ‌సూలు చేస్తూ వార్తాల్లోకెక్కెంది ఇన్ఫోసిస్.

ప్ర‌తి నేల ఉద్యోగుల జీతం నుంచి టూ వీల‌ర్ అయితే 250 రూపాయిలు ఫోర్ వీల‌ర్ అయితే 500 రూపాయిలు పార్కింగ్ ఫీజ్ పేరుతో క‌ట్ చేస్తోంది. అయితే కంపెనీ తీసుకున్న ఈ విచిత్ర నిర్ణ‌యంతో ఉద్యోగులు ఒక్క‌సారిగా షాక్ కు గురయ్యారు.ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని ప‌దుల సంఖ్య‌ల కంపెనీల్లో ప‌నిచేశాం కానీ ఏ కంపెనీలోనూ ఇటువంటి విచిత్రమైన రూల్ లేద‌ని వాపోతున్నారు సంస్థ ఉద్యోగులు. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ మాన‌వ హ‌క్కుల సంఘంను ఆశ్ర‌యించారు. మాన‌వ హాక్కుల సంఘం కూడా ఈ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. షాప్స్ అండ్ ఎస్టాబిలెస్ మేంట్ చ‌ట్టం 2003 ప్ర‌కారం కంపెనీ ఉద్యోగ‌స్తుల‌కు క‌నీస సౌక‌ర్య‌లు క‌ల్పించాల‌ని అలా క‌ల్పించిన వాటికి ఎటువంటి రుసుము వ‌సూలు చేయ‌డానికి వీళ్లేదు. అయిన కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై త‌మ‌కు రెండు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులు జారీ చేసింది.

దీనిపై స్పందించిన ఇన్ఫోసిస్ యాజ‌మాన్యం త‌మ క్యాంప‌స్ లో దాదాపు 20 వేల మంది ప‌ని చేస్తోంటార‌ని అయితే అంద‌రికి అన్ని సౌక‌ర్య‌లు క‌ల్పించామన్నారు. కానీ పార్కింగ్ విష‌యంలో ఉద్యోగ‌స్తుల వాహ‌నాలు ఎక్కువ‌య్యాయన్నారు. అందుకే పార్కింగ్‌ను మెయిటైన్ చేయ‌డానికి మాత్రమే పార్కింగ్ ఫీజు వ‌సూలు చేస్తున్నామని సంస్థ ప్ర‌తినిధులు మాన‌వ హ‌క్కుల సంఘానికి వివ‌రించారు. అయితే చ‌ట్ట‌రిత్యా అది నేరం కాబ‌ట్టి వెంట‌నే ఆ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని సంస్థ‌ను ఆదేశించింది మాన‌వ హ‌క్కుల సంఘం.మ‌రోవైపు ఇన్ఫోసెస్ నిర్ణ‌యాన్ని ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు కూడా వ్య‌తిరేకిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఐటీ కంపెనీ కూడా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఇంత పేరున్న సంస్థ ఇలా చేయ‌డం కాస్త ఆశ్చ‌ర్యానికి గురిచేసింద‌ని అంటున్నారు.
(బాలకృష్ణ,న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading