ఇండియన్ టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా.. పెళ్లి తరువాత.. బిడ్డకు తల్లైనా.. చెక్కు చెదరని అందం ఆమెది.. ఇప్పటికే ఆమె అంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తనకంటే క్రేజీ ఫ్యాన్స్ ను సంపాదించి పెట్టింది ఆమె అందం.. ఆట.. వయసు పెరుగుతున్నా టెన్నిస్ కోర్టులో అందాల ఆరబోతతో యూత్ మదిని కొల్లగొడుతూనే ఉంది ఇండియన్ టెన్నిస్ బ్యూటీ.. టెన్నిస్ అంటే పెద్దగా ఇష్టం లేని వారు కూడా సానియా మ్యాచ్ వస్తోంది అని తెలిస్తే టీవీలకు అతుక్కుపోవడం కాయం.. ప్రస్తుతం టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్ క్రీడలకు ఆమె సిద్ధమైంది. ఇటీవల ప్రధాని మోదీని కూడా కలిశారు. ఆయన తమకు ఇచ్చిన గౌరవం ఎప్పటికీ మరిచిపోలేదని అంటూ ఆ వెంటనే సానియా ట్వీట్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు భారత అథ్లెట్లు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను అభిమానులతో పంచుకునే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టోక్యోలో ప్రారంభం కాబోతున్న ఒలంపిక్స్ గేమ్స్‌లో పాల్గొనబోతున్న సానియా మీర్జా.. కొత్త ఇండియన్ ఒలింపిక్ కిట్‌ను ధరించారు. ఆ డ్రెస్ ఆమెకు తెగ నచ్చింది. అయితే ఆ ఆందం డ్రెస్ ది కాకపోయినా.. భారత్ కు ఆడుతున్నామనే ఒక గర్వం ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ ఒలింపిక్ లాంటి ఈవెంట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడమంటే మాటలు కాదు.. కొన్ని కోట్ల మందిలో కనీసం వంద మందికి కూడా ఛాన్స్ దక్కదు.. అలాంటి అవకాశం వస్తే ఎవరు ఆనందంగా ఉంటారు. అందుకే పతకం వచ్చినా రాకున్నా.. ఒలింపిక్ లో పోటీ పడడమే పెద్ద అచీవ్ మెంట్ గా భావిస్తారు. ఈ సారి సానియా మాత్రం కచ్చితంగా మెడల్ సాధిస్తామనే ధీమాతో కనిపిస్తున్నారు...
ఇదీ చదవండి: వింబుల్డన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రెండు మ్యాచ్‌లపై విచారణ
అందుకే తాజగా ఇండియన్ ఒలింపిక్ కిట్ ధరించిన ఆమె హుషారుగా డాన్స్ చేశారు. అమెరికన్ రాపర్ డోజా క్యాట్‌కు సంబంధించిన తాజా హిట్ పాట ‘కిస్ మి మోర్’కు బ్లూ కలర్ జెర్సీ ధరించి కాసేపు స్టెప్పులు వేశారు. తన పేరులో వచ్చే ఇంగ్లీష్ లెటర్ ‘ఏ’ను విస్తరిస్తే.. అందులో చాలా జీవితం ఉంది అంటూ క్యాప్షన్ పెట్టి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో దూకుడు, ఆశయం, సాధించడం, ఆప్యాయత అన్ని అందులో ఉన్నాయి ఉంటాయి అంటూ కామెంట్ చేశారు. http://
View this post on Instagram
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా క్షణాల్లోనే లక్షల మంది లైక్ కొట్టారు. ఈ వీడియోను వీక్షించిన పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా.. ‘నీ డాన్స్ మూవ్మెంట్స్ నాకు చాలా నచ్చాయి. నీకు అభినందనలు’అని కామెంట్ చేశారు. ఆమెకు పలువురు అభిమానులు టోక్యో ఒలంపిక్స్‌కు ‘ఆల్ ద బెస్ట్’ తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. భారత ఒలంపిక్స్ అసోషియేషన్.. కొత్త ఇండియన్ ఒలింపిక్స్ కిట్‌ను గత నెల విడుదల చేసింది. అదే విధంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సానియా.. టోక్యో ఒలంపిక్స్ కోసం తాను చేస్తున్న సాధన గురించి ప్రధానికి వివరించారు. మహిళల డబుల్స్ విభాగంలో సానియా, అంకితా రైనాతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ జోడీపై భారీ అంచనాలే ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Sania Mirza, Tennis, Tokyo Olympics