Home /News /telangana /

Electricity Department: జీతం నెలకు రూ.2 లక్షలు.. రూ.30 వేల కోసం అతడు ఏం చేశాడో చూడండి..

Electricity Department: జీతం నెలకు రూ.2 లక్షలు.. రూ.30 వేల కోసం అతడు ఏం చేశాడో చూడండి..

అనిశాకు చిక్కిన అధికారి

అనిశాకు చిక్కిన అధికారి

Electricity Department: ఆశకు కూడా ఓ హద్దు ఉంటుంది. నెల నెలా వచ్చే జీతం తక్కువగా ఉండటంతో చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ఇతగాడికి నెలకు రూ.2 లక్షల జీతం అయినా సరిపోవట్లేదు. లంచాలకు అలవాటు పడి రూ.30వేలు లంచం అడిగి అడ్డంగా బుక్కయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  ఆశకు కూడా ఓ హద్దు ఉంటుంది. నెల నెలా వచ్చే జీతం తక్కువగా ఉండటంతో చాలామంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తినడానికి తిండి లేకుండా.. పస్తులు ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పే వ్యక్తికి మాత్రం అటువంటి పరిస్థితి లేదు. విద్యుత్ డిపార్ట్ మెంట్ లో పెద్ద పోస్టులోనే పని చేస్తున్నాడు. అతడికి జీతం ఎంతో తెలుసా.. వేలల్లో కాదు లక్షల్లో ఉంది. నెలకు అతడు రూ.2లక్షలు జీతం తీసుకుంటున్నాడు. కానీ అతడికి మాత్రం ఆశ చావలేదు. డబ్బులు సంపాదించడానికి ఇంకా మరో మార్గం ఉంది కదా అని లంచాల బాట పట్టాడు. అనుమ‌తి ప‌త్రం ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేశాడు.

  Young Women: త్వరలో పెళ్లి చేసుకోబోయే 20 ఏళ్ల యువతిని.. వీళ్లు చేసిన పనికి.. ఇంత దూరం వచ్చింది..


  Chief Minister KCR: దళితులకు గుడ్ న్యూస్.. ఆ పథకం కింద రూ.250 కోట్లు విడుదల..


  బాధితుడు ఏసీబీ(అవినీతి నిరోధ‌క శాఖ‌)ని ఆశ్రయించ‌డంతో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా స‌ద‌రు ఏడీఈ ని ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌రిగింది. .రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారాయణ దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేశాడు. గోల్కొండ లోని ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ స్టేషన్ లో సబ్ డివిజన్ లో ఏడీఈగా చరణ్ సింగ్ నే అతడు విధులు నిర్వహిస్తున్నాడు. మణికొండకు చెందిన గుత్తేదారు ర‌వి గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా ఆ శాఖ‌లో చిన్న చిన్న ప‌నులు చేస్తున్నారు.

  OMG: ఏమోలే.. ఒకే ఊరు కదా అని మాట్లాడింది.. కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది..


  Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..


  మణికొండలో విద్యుత్ తీగలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం, కొత్త ట్రాన్స్ ఫార్మర్లను అమర్చాల్సిన టెండర్ ను ఇటీవ‌ల రవి దక్కించుకున్నాడు. అందుకు అవసరమైన అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంది. పత్రం ఇవ్వాలంటే.. రూ.30 వేలు ఇవ్వాలంటూ లంచాన్ని డిమాండ్ చేశాడు. దీంతో ఆ రవి.. అవినితి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

  Neighber Boy: తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఆమె ఏం చేసిందో చూడండి.. పక్కింటి యువకుడితో..


  వారి సూచన మేరకు 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రవి రూ. 30వేల డబ్బుతో ఏడీఈ కార్యాలయానికి చేరుకున్నాడు. లంచం సొమ్మును చరణ్ సింగ్ కు ఇస్తుండడం..వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. విచారణ అనంతరం ఆయన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించినట్ల చరణ్ సింగ్ నివాసాలు మరియు కార్యాలయాల్లో సోదాలు జరిపినట్లు డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:Veera Babu
  First published:

  Tags: Brand Hyderabad, Crime, Crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు