హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఫాంహౌస్‌లో హైటెక్ వ్యభిచారం.. యువతిని తీసుకొచ్చి దందా ?

Hyderabad: ఫాంహౌస్‌లో హైటెక్ వ్యభిచారం.. యువతిని తీసుకొచ్చి దందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్  శివారుల్లో  హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు చేశారు. పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో కొన్ని ఫామ్ హౌస్లే అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడులకు దిగారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రం సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ఫామ్ హౌజ్ లో పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.

ఫాం హౌస్‌లో పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఈ ఐదుగురు  విటులు యువతీని ఫామ్ హౌస్ కు తీసుకొచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే యువతీనీ ప్రలోభ పెట్టి తీసుకు వచ్చారా? లేక వ్యభిచార చేయించేందుకు తీసుకువచ్చారా? అన్న విషయాలు ఇంకా తెలియల్సి ఉంది.

పోలీసులు జరిపిన దాడుల్లో యువతితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి మూడు కార్లు.. నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ ఫాం హౌస్ మహేశ్వరం ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ఓ సర్పంచ్ ‌ది అని ప్రాథమిక సమాచారం. ఈ విషయమై కొత్తూరు సిఐ బాలరాజ్ ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ 5 మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు ధృవీకరించారు. బాధితురాలి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

మరోవైపు ఈ ఘటనలో ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నట్టు బయట ప్రచారం జరుగుతుంది. అతను పోలీసులకు చిక్కాడా లేక చాకచక్యంగా తప్పించుకున్నాడా? అన్న వివరాలు తెలియాలి. ఫామ్ హౌస్ లో మొత్తం ఆరు మంది మహిళతో కలిపి ఉండగా ఇందులో ఐదు మంది పోలీస్ అదుపులోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరిలో సదరు ప్రజాప్రతినిధి ఉన్నాడా? లేదా అన్న విషయం విచారణలో తేలనుంది.

First published:

Tags: Hyderabad, Local News, Sex Racket

ఉత్తమ కథలు