హోమ్ /వార్తలు /తెలంగాణ /

Terrace Garden: మిద్దెపంటతో అద్భుతాలు చేస్తున్న మహిళ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఆదాయానికి ఆదాయం..

Terrace Garden: మిద్దెపంటతో అద్భుతాలు చేస్తున్న మహిళ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..ఆదాయానికి ఆదాయం..

టెర్రస్ గార్డెన్ లో లీల

టెర్రస్ గార్డెన్ లో లీల

Terrace Garden: మహానగరాల్లో టెర్రస్ గార్డెన్ ఇప్పుడో ఫ్యాషన్. ప్రస్తుతం చాల ప్రాంతాల్లోని ప్రజలు మేడపై మొక్కల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు.

M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

మహానగరాల్లో టెర్రస్ గార్డెన్ ఇప్పుడో ఫ్యాషన్. ప్రస్తుతం చాల ప్రాంతాల్లోని ప్రజలు మేడపై మొక్కల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు పూల మొక్కలు పెంచుతుంటే మరికొందరు వివిధ రకాల కూరగాయల మొక్కల్ని పెంచుకుంటున్నారు. ఇంట్లోనే సేంద్రీయ పంటలను పండించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఐతే ఓ మహిళ మాత్రం... ఇంటిపంటతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని ఆర్జిస్తూ.. సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయ్యారు. కొన్నేళ్ల క్రితం దర్ష సాయి లీల కుటుంబంతో సహా హైదరాబాద్ కి వచ్చేసారు. లీలకు మొక్కల పెంపకం అంటే చాల ఇష్టం. అందులోనూ టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలనే కోరిక తనది. దీంతో ఇంటిపై కొన్ని రకాలపూల మొక్కలను పెంచుతూ వచ్చారు. నగరానికి వచ్చిన కొన్ని రోజుల అనంతరం ఆమెకు థైరాయిడ్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. రసాయనాలు వాడి పండించిన కూరగాయలకు దూరంగా ఉండాలని... సహజ ఉత్పత్తులను తినాలని డాక్టర్లు ఆమెకు సూచించారు.

దీంతో మనం రోజూ తీసుకొనే ఆహారం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని... పిల్లలకు కూడా హాని చేస్తున్నాయని ఆమె గుర్తించింది. సేంద్రియ పద్ధతి ద్వారా ఇంటి డాబాపై కూరగాయలు, పండ్లు, వివిధ రకాల మొక్కలు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఆమెకు తోట పనంటే ఎంతో ఇష్టం. మొక్కలు అంటే ఎంతో ప్రేమ కూడా. దీంతో అనుకున్నదే తడవుగా టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి అవగాహన పెంచుకొని ఇంటిపంటతో మంచి దిగుబడులు సాధించడం మొదలుపెట్టారు.

ఇది చదవండి: మీరు తినే కూరగాయలు మంచివేనా..? కల్తీ జరిగిందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..


తన అభిరుచికి అనుగుణంగా గార్డెన్ ను విస్తరిస్తున్న దర్ష... తనకు కావాల్సిన పనిముట్లు, విత్తనాలు, మట్టి, ఎరువులు వంటి వాటిని ఒక ప్యాకెజీ మాట్లాడుకొని ఉద్యాన శాఖ ద్వారా పొందుతూ వస్తున్నారు. అంచెలంచేలుగా పెంచిన తన 2000 చదరపు అడుగుల టెర్రస్ గార్డెన్ ద్వారా 190 రకాల మొక్కలను 800వందల కుండీల్లో ద్వారా పెంచుతుతున్నారు. ఈ రకాలన్నీ చైనా, టర్కి, అమెరికా, ఇథియోపియా, ఇటలీ, మెక్సికో వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విత్తనాల ద్వారా గార్డెన్ ను అభివృద్ధి చేశారు.

ఇది చదవండి: రైతుగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఏడాది ఆదాయం ఎంతో తెలుసా..?


ఇంటిపైనే సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఆమె.. తన అభిరుచులు, ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు. శైలీల వ్లోగ్స్ (saileela vlogs) పేరుతో యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి లక్షమంది సుబ్ స్క్రైబర్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ ఛానెల్ ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో ద్వారా వెజిటబుల్స్ పెంపకంపై వ్లాగ్స్ చేస్తుంటుంది సాయిలీల. తన కుటుంబానికి ఆరోగ్య కరమైన జీవితం అందించేలా పెరటిపై 190 రకాల కూరగాయలు.. అందులోనూ 65 రకాల టమోటాలు పెంచుతున్నారు. ఇక రకాల క్రోటన్స్, పదిరాకాల పొట్ల కాయలు, 15 రకాల వంకాయలు ఉన్నాయి. అంతేకాదు మరికొన్ని గుమ్మడికాయలు, బీన్స్, అరటి, క్యారట్, మిరప వంటి వాటితో పాటుగా ఔషధ మొక్కలను పెంచుతున్నారు.

ఇది చదవండి: మోసం చేసిన వాడికే ఆ వీడియోలు పంపిన యువతి... చివరికి ఏమైందంటే..!


అనేక దేశీయ, విదేశీయ కూరగాయల్ని తన డాబాపైనే రసాయన రహిత సేంద్రియ వ్యవసాయం ద్వారా పండిస్తున్నారు. తన కుటుంబానికి సరిపడా కూరగాయల్ని తీసుకోని మిగిలిన కూరగాయల్ని ఇరుగు పొరుగువారికి పంచుతున్నారు. ఇతరులు రసాయనరహిత వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా విత్తనాలు సైతం పంపిణి చేస్తోంది. ఇక సేంద్రియ వ్యవసాయానికి వాడాల్సిన వస్తువుల గురించి నూతనంగా అడుగుపెట్టే వారికీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఎలాంటి రసాయనం లేకుండా ప్రకృతి సిద్ధంగా లభించే వాటితోనే ఎరువు తాయారు చేసే పద్దతిని నేర్పిస్తున్నారు.  30%శాతం కోకోపీట్ మరో 30% శాతం ఆవు పేడ., 40 శాతం మట్టి మిశ్రమాన్ని వాడేలా సూచిస్తున్నారు. ప్రతి 15 రోజులకి ఒక మారు సేంద్రియ పురుగుల మందు పిచికారీ చేయాలనీ... ముక్కలకు తగినంత సూర్యకాంతి వచ్చేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది చదవండి: అత్తాకోడళ్ల ఫైటింగ్.. చివరికి పోలీసుల్నే పరుగులు పెట్టించింది.. అసలేం జరిగిందంటే..


దీనిపై లీల మాట్లాడుతూ... "రసాయనాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆహారాల కంటే సేంద్రీయ ఆహార ఉత్పత్తుల్లో విటమిన్ మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. రసాయనాలు లేని మట్టిలో ఉండే పోషకవిలువలు మరియు ఖనిజాలే ఇందుకు ప్రధాన కారణం. సేంద్రియ తోటపనిలో ప్రాధమిక సిద్ధాంతం ప్రకృతికి బాగా తెలుసు. మొక్కలు మరియు మానవులను ఆరోగ్య ప్రమాదంలో పడేసే హానికరమైన రసాయన పురుగుమందుల వాడకాన్నీ ఆపివేయడం ద్వారా మానవ హిత కూరగాయలను పండించవచ్చు. సేంద్రీ. వ్యవసాయానికి ఉత్తమంగా సరిపోయే సహజ పద్ధతులను ఉపయోగించి మట్టిలో మొక్కలను పెంచుతారు. సేంద్రీయ ఉద్యమంలో పాల్గొన్న వారు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోని మరింత ఆరోగ్యవంతులుగానే కాకుండా... భూమికి అనుకూలమైన పర్యావరణ పరిరక్షణ మార్గంలో జీవించడానికి ప్రయత్నిస్తారని" తెలిపారు

First published:

Tags: Andhra Pradesh, Hyderabad, Organic Farming, Telangana

ఉత్తమ కథలు