Hyderabad : ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి -అసాధారణ ఆపరేషన్‌లో చివరికి..

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

అరుదైన సంఘటనగా హైదరాబాద్ లో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లకు జన్మనిచ్చింది. దాదాపు అసాధారణ పరిస్థితిలో ఆపరేషన్ నిర్వహించామని, తల్లికి విపరీతంగా రక్తంపోయిందని, కడుపులో నుంచి మొత్తం నలుగురు పిల్లల్ని బయటికి తీశామని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం వారి..

  • Share this:
శిశువుల జననాలకు సంబంధించి తెలంగాణలో అరుదైన, అద్బుతమైన ఘటనలు పరిపాటిగా మారాయి. ఇటీవల నెలల వ్యవధిలోనే వరంగల్ జిల్లాలో 5 కేజీల బరువుతో ఇద్దరు శిశువులు జన్మించడం, ఆగస్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మ‌హిళ‌ ఒకే కాన్పులో న‌లుగురు శిశువులకు జ‌న్మ‌నివ్వడం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోనూ ఓ తల్లి ఒకే కాన్పులో నలుగురు పిల్లల్ని కనింది.

హైదరాబాద్ సిటీ మెహదీపట్నంలోని మినా ఆస్పత్రి డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని హఫీజ్ బాబా నగర్ కు  చెందిన 27 ఏళ్ల మహిళ మూడోసారి గర్భవతి అయినప్పటి నుంచీ రెగ్యులర్ గా ఆస్పత్రికి వస్తోంది. నెలలు దగ్గరపడుతోన్న కొద్దీ అనూహ్యంగా ఆమెకు బీపీ పెరిగిపోయింది. బీపీ సమస్య తీవ్రంగా ఉండటంతో ఏడో నెల నుంచే ఆస్పత్రిలో చేరిపోయింది. 34వారాలు నిడగా, నిన్న మంగళవారం(అక్టోబర్ 26న) పురిటినొప్పులు వచ్చాయి..

మాజీ క్రికెటర్ VVS Laxman పోటీ చేయబోయే నియోజకవర్గం ఏదో తెలుసా? -పొలిటికల్ ఇన్నింగ్స్ ఇలా..


గర్భిణికి బీపీ సమస్య ఉండటంతో మినా ఆస్పత్రి డాక్టర్లు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ నిర్వహించారు. దాదాపు అసాధారణ పరిస్థితిలో ఆపరేషన్ నిర్వహించామని, తల్లికి విపరీతంగా రక్తంపోయిందని, కడుపులో నుంచి మొత్తం నలుగురు పిల్లల్ని బయటికి తీశామని, ఆ తర్వాతగానీ రక్తస్రావాన్ని ఆపగలిగామని డాక్టర్ షుకూర్ తెలిపారు.


photoshoot at funeral: తండ్రి శవం పక్కనే సెక్సీ ఫొటో షూట్ -నువ్వసలు మనిషివేనా?


ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లల్లో ఒకడు అబ్బాయి కాగా, మిగతా ముగ్గురు అమ్మాయిలనీ, వారంతా 1.3 నుంచి 1.5కేజీల బరువున్నారని, ప్రస్తుతనానికి తల్లీ పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అరుదైన ఘటనగా ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడంతో వారి కుటుంబాలతోపాటు ఆస్పత్రిలోనూ సందడి వాతావరణం నెలకొంది.
Published by:Madhu Kota
First published: