ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. ఈ క్రమంలో అసదుద్దీన్ చీఫ్ హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదని, అత్యధికంగా కండోమ్‌లు వాడుతున్నది ముస్లింలేనని (Using Condoms Most) ఆయన అన్నారు. గతంలో.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ (Mohan Bhagwat) భగవత్ దేశంలో ముస్లింల (muslim) జనాభానే అధికంగా ఉందంటూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా, అసద్ తాజాగా, ఈవిధంగా స్పందినట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా పెరగడానికి బదులుగా అది తగ్గుతోందని అసద్ అన్నారు. అదే విధంగా.. ముస్లింలలో పిల్లల మధ్య అంతరం కూడా పెరుగుతోంది. కండోమ్‌లను ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మేము. మోహన్ భగవత్ దీని గురించి మాట్లాడరని ఒవైసీ అన్నారు.
భారతదేశానికి జనాభా నియంత్రణకు "అందరికీ సమానంగా వర్తించే" విధానం అవసరమని బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ వార్షిక దసరా ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలలో, జనాభాలో "మత ఆధారిత అసమతుల్యత", "బలవంతపు మతమార్పిడులు" కూడా ఉదహరించారు. "జనాభా నియంత్రణతో పాటు, మతపరమైన ప్రాతిపదికన సమతుల్యత కూడా విస్మరించలేని ముఖ్యమైన విషయమని ఆయన నొక్కిచెప్పారు. కాగా, ఒవైసీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 5ని ఉదహరిస్తూ ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) అత్యధికంగా పడిపోయిందని అన్నారు.
అదే విధంగా.. అసద్ మాట్లాడుతూ.. తప్పిపోయిన హిందూ బాలికల గురించి మాట్లాడటానికి RSS చీఫ్‌కి ధైర్యం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2000 నుండి 2019 వరకు మా హిందూ సోదరీమణుల కుమార్తెలు లక్షల మంది తప్పిపోయారు. కానీ భగవత్ దీని గురించి మాట్లాడరని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఎఐఎంఐఎం అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఎక్కడ అధికారంలో ఉన్నా ముస్లింలు ‘బహిరంగ జైలులో జీవిస్తున్నట్లు’ కనిపిస్తోందని ఒవైసీ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, Hyderabad, Mohan Bhagwat, VIRAL NEWS