HYDERABAD HYDERABAD TRAFFIC POLICE SPECIAL DRIVE ON INSPECTION OF VEHICLES WITH PRESS POLICE AND MLA STICKERS SNR
HYDERABAD:వెహికల్‌కి ముందు వెనుక ఆ స్టిక్కర్స్ ఉన్నాయా..జాగ్రత్త వాళ్లు పట్టుకుంటే వదలరంట
(Photo Credit: Twitter)
HYDERABAD:జంటనగరాల పరిధిలో వాహనాలపై ప్రెస్, పోలీస్, ఎమ్మెల్యే స్టిక్కర్స్ తగిలించుకొని తిరుగుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆ స్టిక్కర్ల అంటించుకున్న వాహనదారులు పర్సనల్ ఐడీ కార్డులు లేదంటే ప్రొఫెషనల్ ఐడీ కార్డులు చూపిస్తేనే వదులుతామని లేదంటే కేసు నమోదు చేసి చలానా వసూలు చేస్తామంటున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, వాహనాల పేపర్లు లేకుండా బైక్‌లపై కేవలం పోలీస్Police, ఆర్మీ(Army) డిఫెన్స్(Defense), ప్రెస్ (Press), ఎమ్మెల్యే(MLA), జీహెచ్ఎంసీ (Ghmc), డాక్టర్(Doctot), అడ్వకేట్(Advocate) అని స్టిక్కర్లు పెట్టుకొని రోడ్లపైకి వచ్చే నకిలీగాళ్లకు చెక్ పెట్టాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) నిర్ణయించారు. ఇలాంటి వాహనాలు జంటనగరాల పరిధిలో ఎక్కడ కనిపించినా ఆపి మరి ప్రత్యేకంగా తనిఖీలు(Special drive) చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రముఖుల వ్యక్తుల పేర్లతో, సమాజంలో గౌరవప్రదమైన హోదా కలిగిన వ్యక్తులు, సంస్థల పేరనును అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా వాహనాలపై తిరిగే వాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఎవరైనా వాహనంపై స్టిక్కర్ అంటించుకుంటే దానికి సంబంధించిన వ్యక్తిగత లేదంటే ప్రొఫెషనల్ గుర్తింపు కార్డును తప్పని సరిగా చూపిస్తేనే వదులుతామని పోలీసులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో వాహనంపై ఎలాంటి స్టిక్కర్ అంటించినప్పటికి సరైన ఐడీ కార్డు(Personal ID card), పర్సనల్ ఐడెంటిటి కార్డు(Professional ID card) లేకపోతే అలాంటి వాహనాల్ని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు గ్రేటర్ ట్రాఫిక్ పోలీసులు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వర్కవుట్ కావడం లేదు. రీసెంట్గా హైదరాబాద్ జూబ్లిహిల్స్ కారు ప్రమాద ఘటన తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ నకిలీ స్టిక్కర్లు తగిలించుకొని బైక్‌లు, కార్లలో తిరుగుతున్న వారిపై వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సరైన ఆధారాలు చూపించని వాహనదారులపై సీఎంవీ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి చలాన్లు వసూలు చేస్తున్నారు.
వాహనాలపై ఆ స్టిక్కర్స్ ఉంటే జాగ్రత్త..
ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టడానికి ప్రధాన కారణం జూబ్లీహిల్స్‌లో రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో ఆ నేరం బోధన్ ఎమ్మెల్యే షకీల్ కారు అని వార్తలు వచ్చాయి. అందులో ఆయన కుమారుడే ఉన్నాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఎమ్మెల్యే మీడియాతో పాటు పోలీసులకు ఆ కారు తనది కాదని..ఎవరో తన పేరుతో తిరుగుతున్నారని చెప్పడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
#HYDTPinfo
Today, West Central Zone Tr. Police conducted SPL. drive against the tinted glass, improper No. plates & stickers (MLA, Police, Press) of vehicles, which are under against CMV Rules, 1989 & imposed challans against the violating vehicles.@JtCPTrfHydpic.twitter.com/cIGDKmTtqV
పక్కాగా ఆధారాలు చూపించాల్సిందే..
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం తరహాలోనే తప్పించుకోవాలని చూస్తున్న వాళ్లకు ట్రాఫిక్ పోలీసులు ఈవిధంగా చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం రెండు కమిషనరెట్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రెస్, పోలీసు, ఆర్మీ అంటూ వేర్వేరు స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతున్న వాహనాల్ని తనిఖీ చేశారు. డాక్యుమెంట్లు పరిశీలించారు. భవిష్యత్తులో కూడా వాహనాలతో రోడ్లపై వచ్చే వాళ్లు తప్పని సరిగా వ్యక్తిగత గుర్తింపు కార్డు లేదంటే ఉద్యోగ అర్హతకు సంబంధించిన ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలని పోలీసులు వాహనాలు ఆపి అడిగితే చూపించాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.