Home /News /telangana /

HYDERABAD HYDERABAD TRAFFIC POLICE REMOVE TRIVIKRAM CAR BLACK FILM AT JUBILEE HILLS SB

Trivikram: త్రివిక్రమ్ కారు ఆపిన పోలీసులు.. ఫైన్ వేసిన అధికారులు

త్రివిక్రమ్ (ఫైల్ ఫోటో)

త్రివిక్రమ్ (ఫైల్ ఫోటో)

జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద త్రివిక్రమ్ కారును పోలీసులు ఆపారు. తనిఖీల్లో భాగంగా కారును సోదా చేశారు. కారు అద్దలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ తర్వాత ఫైన్ కూడా వేశారు.

  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. జూబ్లిహీల్స్‌లో త్రివిక్రమ్ కారును ఆపారు. కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు.అంతేకాదు ఆయన కారుకు జరిమానా కూడా విధించారు. అయితే నగరంలో ట్రాఫిక్ పోలీసులు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లి హీల్స్ ప్రాంతాల్లో వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన అధికారులు బ్లాక్ ఫిల్మ్ ఉండే కార్లపై కొరడా ఝులిపిస్తున్నారు. ఎంతటి వారు అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెడితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు.

  ఇటీవలే వరుసగా ప్రముఖ హీరోలకు షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఇటీవలే మంచు మనోజ్‌తో పాటు అల్లు అర్జున్ కారును కూడా ఆపి బ్లాక్ ఫిల్మ్ తొలగించారు. వారి కార్లకు జరిమానా కూడా విధించారు. తాజాగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద త్రివిక్రమ్ కారును ఆపిన పోలీసులు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి రూ.700 ఫైన్ కూడా వేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అనధికారికంగా స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్మ్‌లు పెడితే జరిమానాలు విధిస్తున్నారు.

  ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోన్న వారిని గుర్తించేందుకు పోలీసులు చేప‌ట్టిన ప్ర‌త్యేక‌ డ్రైవ్ లో ఇప్ప‌టికే సినీ హీరోలు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మంచు మ‌నోజ్, కల్యాణ్ రామ్‌ కార్ల‌ను కూడా త‌నిఖీ చేసిన పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌ ను తొలగించి చలానాలు విధించారు. సెలబ్రిటీలు కూడా ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని కోరుతున్న పోలీసులు.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Hyderabad, Hyderabad police, Trivikram, Trivikram Srinivas

  తదుపరి వార్తలు